Share News

Ra Kadali Ra Sabha Live Updates: వైఎస్ జగన్ ‘సిద్ధం’పై చంద్రబాబు అదిరిపోయే సెటైర్!

ABN , First Publish Date - Mar 04 , 2024 | 04:14 PM

Ra Kadali Ra Sabha at Penukonda: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రా కదలి రా..’ కార్యక్రమం నేటితో ముగియనుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో చివరి సభ జరుగుతోంది. వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు చేరుకున్నారు. అభివాదం చేసుకుంటూ స్టేజీపైకి చంద్రబాబు వచ్చారు. సభా ప్రాంగణం అంతా టీడీపీ నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకలతో కియా పరిసర ప్రాంతాలన్నీ హోరెత్తాయి..

Ra Kadali Ra Sabha Live Updates: వైఎస్ జగన్ ‘సిద్ధం’పై చంద్రబాబు అదిరిపోయే సెటైర్!

Live News & Update

  • 2024-03-04T17:15:22+05:30

    ‘అనంత’ అంటే చాలా ఇష్టం.. ఎందుకంటే..?

    • పెనుకొండ రా.. కదలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు

    • అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం: చంద్రబాబు

    • అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం

    • అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించాం

    • అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం

    • సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు

    • కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించాం

    • గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తిచేసి కియాను తెచ్చాం

    • కియాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉద్యోగాలు కల్పన

    • రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే బలమైన కోరిక అందరిలో ఉంది

    • టీడీపీ, జనసేన కలిసింది.. మా స్వార్థం కోసం కాదు

    • రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే టీడీపీ-జనసేన కలిశాయి

    • అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి

    Chandrababu-F.jpg

  • 2024-03-04T17:15:00+05:30

    సిద్ధంపై సీబీఎన్ సెటైర్!

    • సిద్ధం సిద్ధం అని జగన్ అంటున్నాడు..

    • నువ్వు ఓడిపోవడానికి సిద్ధం

    • టీడీపీ-జనసేన కూటమి గెలుపు

    • వైసీపీ ఓటమి ఖాయం

    • రూ. 200 పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది టీడీపీనే

    • ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే పెన్షన్లు కట్ చేస్తున్నారు..

    • టీడీపీ అధికారంలోకి రాగానే పెన్షన్లలో ఎలాంటి కోతలు ఉండవు

    CBN-Sataire.jpg

  • 2024-03-04T17:00:53+05:30

    జగన్‌పై మాటల యుద్ధం..!

    • అనంతపురంలో ఎవరిది అభివృద్ధి.. ఎవరిది దోపిడో ఆలోచించాలి

    • నాలెడ్జ్ హబ్ అన్నారు.. కానీ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు

    • స్కీమ్‌లన్నీ.. స్కాముల కోసమే రూపొందించారు

    • స్కాముల్లో మళ్లీ స్కాములు చేసే వ్యక్తి జగన్

    • భావి తరాల గురించే నా ఆలోచన

    • ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్:01గా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం

    • రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి

    • ఆ వనరులను సక్రమంగా వాడుకుంటే..

    • మనమే ఇతర రాష్ట్రాల యువతకు ఉపాధి కల్పించవచ్చు

  • 2024-03-04T16:45:35+05:30

    మా కోసం కాదు.. మీ కోసమే!

    • టీడీపీ-జనసేన పొత్తు మా కోసం కాదు

    • రాష్ట్ర ప్రజల కోసమే మేం కలిశాం

    • బంగారం లాంటి రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసింది

    • రైతులను ఆదుకోవడానికి.. యువత ఉద్యోగాల కోసం..

    • మహిళల రక్షణ కోసం ‘రా కదలి రా’ అంటూ పిలుపు

    • అందరం కలిసి సైకో జగన్‌ను ఇంటికి పంపించాలి

  • 2024-03-04T16:45:01+05:30

    పాశుపతాస్త్రం..

    • టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రం

    • రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాం

    • 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చాం

    • ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది.. మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేది : చంద్రబాబు

  • 2024-03-04T16:35:43+05:30

    టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్

    • రా కదలిరా సభల ద్వారా టీడీపీ శ్రేణుల్లో ఎనలేని జోష్

    • పెనుకొండ ‘రా కదలి రా’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం

    • ఎంతో ఆసక్తిగా ప్రసంగం వింటున్న కార్యకర్తలు, అభిమానులు

    • టీవీలు.. యూ ట్యూబ్‌లకు అతుక్కుపోయిన కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు

    Chandrababu-Speechg.jpg

  • 2024-03-04T16:25:07+05:30

    పెనుకొండ పసుపుమయం..

    • తెలుగుదేశం జెండాలతో పసుపుమయమైన పెనుకొండ

    • ఎటుచూసినా జెండాలే కనిపిస్తున్న పరిస్థితి

    • ప్రసంగం మొదలుపెట్టిన చంద్రబాబు

    • సీఎం.. సీఎం.. అంటూ అరుపులు, కేకలు.. నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు

    CBN-Speech.jpg

  • 2024-03-04T16:15:48+05:30

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రా కదలి రా..’ కార్యక్రమం నేటితో ముగియనుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో చివరి సభ జరుగుతోంది. వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు చేరుకున్నారు. అభివాదం చేసుకుంటూ స్టేజీపైకి చంద్రబాబు వచ్చారు. సభా ప్రాంగణం అంతా టీడీపీ నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన కిక్కిరిసిపోయింది. ఈలలు, కేకలతో కియా పరిసర ప్రాంతాలన్నీ హోరెత్తాయి.

    ఎదురుచూపులు

    మరోవైపు.. ట్రాఫిక్‌లో ఎక్కడికక్కడ టీడీపీ నేతలు.. కార్యకర్తలు ఇరుక్కుపోయారు. ఇక భారీ సంఖ్యలో వచ్చిన నేతలు, కార్యకర్తలను పోలీసులు, వాలంటీర్లు అదుపుచేయలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే .. టీడీపీ జెండాలతో పెనుకొండ పసుపు మయమైంది. ముగింపు సభలో చంద్రబాబు ఏం మాట్లాడుతారా..? ఎలాంటి ప్రకటనలు చేస్తారా..? అని టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. పెనుకొండలో జరుగుతున్న ‘రా కదలి రా’ భారీ బహిరంగ సభను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌లో చూసేద్దాం రండి..

    Ra-Kadali-Ra-Penukonda.jpg