Share News

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:16 PM

TDP-JSP Second List: టీడీపీ-జనసేన (TDP-Janasena) తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తు్న్నాం. ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోవడంతో పాటు.. ఈ జాబితా దెబ్బకు వైసీపీ అధిష్టానంలో వణుకు మొదలైంది. టీడీపీ, జనసేన తరఫున టికెట్లు ఆశించిన ఆశావహులు.. కొందరు సిట్టింగ్ తెలుగు తమ్ముళ్లు కాసింత నిరాశకు లోనయ్యారు. దీంతో వారందరికీ రెండో జాబితాలో (TDP-JSP Second List) న్యాయం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి...

TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?

టీడీపీ-జనసేన (TDP-Janasena) తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తు్న్నాం. ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోవడంతో పాటు.. ఈ జాబితా దెబ్బకు వైసీపీ అధిష్టానంలో వణుకు మొదలైంది. టీడీపీ, జనసేన తరఫున టికెట్లు ఆశించిన ఆశావహులు.. కొందరు సిట్టింగ్ తెలుగు తమ్ముళ్లు కాసింత నిరాశకు లోనయ్యారు. దీంతో వారందరికీ రెండో జాబితాలో (TDP-JSP Second List) న్యాయం చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జాబితా ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అటు తెలుగు తమ్ముళ్లు.. ఇటు జనసైనికులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. జాబితా రావడానికి సమయం ఆసన్నమైంది. ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయం స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబే.. పార్టీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చారు.

AP Politics: టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ.. కీలక ప్రకటన చేయనున్న మోదీ



babu3.jpg

జాబితా ఎప్పుడంటే..?

సోమవారం నాడు (మార్చి-11) రెండో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్డీఏలో చేరిక అనంతరం ఢిల్లీ నుంచి పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. రెండో జాబితాను సోమవారం విడుదల చేస్తామని.. అసంతృప్తులు, టికెట్ రాలేదని భంగపడిన నేతలతో మాట్లాడాలని ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని.. ఈ పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహ పడొద్దని చంద్రబాబు చెప్పారు. జాబితా ఎప్పుడొస్తుందో చంద్రబాబు ఇలా చెప్పారో లేదో.. ఈసారైనా పేరు ఉంటుందో లేదో.. అని సీనియర్లు, సిట్టింగులు, ఆశావాహులు ఎదురుచూపులు చూస్తున్నారు. మొదటి జాబితాలో చాలా మంది టీడీపీ సీనియర్లు, సిట్టింగులకు సీట్లు దక్కలేదన్న విషయం తెలిసిందే. దీంతో రెండో జాబితాలో అయినా తప్పకుండా పేరు వస్తుందనే కోటి ఆశలతో ఉన్నారు. అటు జనసేనలోనూ ఇదే పరిస్థితి. అయితే.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలువురు సీనియర్లను బుజ్జగించిన సంగతి తెలిసిందే.

బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఎన్ని సీట్లు ఇచ్చారంటే..?


babu6.jpg

‘సారీ’నేనా..?

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు సిట్టింగులకు ఇంతవరకూ సీట్లు కేటాయించలేదు. ముఖ్యంగా సీనియర్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావ్, గొరంట్ల బుచ్చయ్య చౌదరి.. చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజాలకు కేటాయించే నియోజకవర్గాలపై ఇంతవరకూ క్లారిటీ లేదు. మరోవైపు.. పీతల సుజాత, గౌతు శిరీష పేర్లను టీడీపీ అధినేత ప్రకటించలేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. కొన్ని టీడీపీ సిట్టింగ్ స్థానాలను సైతం జనసేన అడుగుతుండటం.. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లపై ఉన్న వ్యతిరేకతతో సీట్లు ఇవ్వలేకపోవడం.. నియోజకవర్గాలు మార్చే పరిస్థితి ఉండటం.. ఇలా పలు కారణాలతో టికెట్లు దక్కలేదని తొలి జాబితా తర్వాత పెద్ద ఎత్తునే తెలుగుదేశంలోనే చర్చ జరిగింది. అయితే.. రెండో జాబితాలో మాత్రం పక్కాగా పేర్లు ఉంటాయని ఆశతో అయితే ఉన్నారు. ఇప్పటి వరకూ టీడీపీ-జనసేన మాత్రమే ఉండటంతో సీట్లు కాస్త అటు ఇటు ఆలస్యమైనా దక్కుతాయని భావించారు. ఇప్పుడు ఈ కూటమికి బీజేపీ కూడా తోడవ్వడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఫైనల్‌గా ఈ జాబితాలో అయినా పేరుంటుందా.. లేకుంటే ఈ ‘సారీ’యేనా అనేది తేలాలంటే లిస్ట్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి.

babu3.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

Updated Date - Mar 09 , 2024 | 09:22 PM