Share News

AP Elections: వైసీపీపై అంబటి రాయుడు సంచలన ఆరోపణలు

ABN , Publish Date - May 02 , 2024 | 08:57 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకునే సరికి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పార్టీ మారిన నేతలు అయితే.. బాబోయ్ మునుపటి పార్టీ బాగోతం బట్టబయలు చేస్తున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మీడియా మీట్, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దుమ్ముదులిపేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YSR Congress) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నది ఒకే ఒక్క మాటే అయినా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయన ఏమన్నారో చూసేద్దాం రండి..!

రాయుడు ఏమన్నారు..?

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని పూర్ణ మార్కెట్‌లో కూటమి తరఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌లను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సభలో పవన్ కీలక ప్రసంగం చేయగా.. రాయుడు మాత్రం వైసీపీ బాగోతాన్ని బట్టబయలు చేస్తూ మాట్లాడారు. ‘ వైసీపీలో బానిసత్వం ఉంది. అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి.. జనసేనలో చేరాను. పవన్ , కూటమి నేతలు నమ్మి అభ్యర్థులను గెలిపించాలి.. రాష్ట్రాన్ని కాపాడండి’ అని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలకు రాయుడు సూచించారు. బానిసత్వం అన్నారంటే.. రాయుడు అంత ఆషామాషీగా అనరు.. ఎందుకంటే ఆరేడు నెలలు పార్టీలో ఉన్న వ్యక్తి.. పైగా గుంటూరు, విజయవాడలో జిల్లాల్లో తిరిగిన నేత కావడంతో ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందనేది అసలు విషయం చెప్పలేదు కానీ మున్ముందు బయటపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

నేను నమ్ముతున్నా..!

వైసీపీ నుంచి బయటికొచ్చాక పెద్దగా మాట్లాడని రాయుడు.. ఈ మధ్య గట్టిగానే ఆ పార్టీకి చురకలు అంటిస్తున్నారు. ఇటీవలే.. గత ఆరు, ఏడు నెలల కాలంలో తాను వైసీపీలో పనిచేశానన్న విషయం గుర్తు చేసుకున్నారు. రాష్ట్రమంతా తిరిగానని.. వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యేలకు పనిలేదని.. ప్రజాసేవ పట్ల శ్రద్ధ లేదని చెప్పి పెను సంచలనానికే తెరదీశారు. అంతేకాదు.. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు ఎలాంటి పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే ఈ విధానం నచ్చక వైసీపీకి గుడ్ బై చెప్పేశానన్నారు. అంతటితో ఆగలేదు.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత సేనాని విజన్ నచ్చిందని.. యువత కోసం ఆయన చేసే ఆలోచనలు నచ్చాయని ఆకాశానికెత్తేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ పడే తపన నచ్చిందని.. దీంతో జనసేనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకుందని రాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 08:57 PM