మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్..

ABN, Publish Date - Jan 04 , 2024 | 01:19 PM

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతించారు. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ కీలక నేతలు తలసాని శ్రీనివాస యాదవ్, మహమ్మద్ ఆలీ, జీవన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితర నేతలు ఉన్నారు. గత నెల 7వ తేదీన కేసీఆర్ ఇంట్లో జారిపడిపోయిన క్రమంలో యశోద ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంట్లో కోలుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనను పరామర్శించేందుకు జగన్ వచ్చారు.

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 1/6

హైదరాబాద్ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో ఆయనకు పుష్పగుచ్చములిచ్చి పరామర్శిస్తున్న దృశ్యం.

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 2/6

మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం ఆయనతో ముచ్చటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఇంకా బీఆర్ఎస్ నేతలు..

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 3/6

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్..

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 4/6

మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యం.

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 5/6

కేసీఆర్ నివాసానికి వచ్చిన ఏపీ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్..

మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 6/6

హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం జగన్‌కు బేగంపేట విమానాశ్రయంలో పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న బీఆర్ఎస్ నేతలు..

Updated at - Jan 04 , 2024 | 01:31 PM