Alliance: టీడీపీ కూటమి సమావేశం దృశ్యాలు..
ABN, Publish Date - Jun 12 , 2024 | 11:25 AM
విజయవాడలో ఏ కనెక్షన్ హాల్లో మంగళవారం జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు. చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు. దీనికి కూటమి ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు.
1/9
విజయవాడలో ఏ కనెక్షన్ హాల్లో జరిగిన కూటమి సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం.
2/9
కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..
3/9
కూటమి సమావేశంలో జనసేన అధినేతతో ముచ్చటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు..
4/9
టీడీపీ కూటమి సమావేశంలో నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..
5/9
కూటమి సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సభలో ఆశీనులైన కూటమి నేతలు పురందేశ్వరి, చంద్రబాబు, పవన్ కల్యాణ్..
6/9
కూటమి సమావేశంలో పెద్దమ్మ పురందేశ్వరి (బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు)ని నమస్కరిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
7/9
అభినందిస్తున్న మామయ్య బాలకృష్ణకు.. ప్రతిగా నమస్కరిస్తున్న నారా లోకేష్..
8/9
కూటమి సమావేశంలో తనను పరామర్శించిన మహిళా నేతలకు నమస్కరిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
9/9
విజయవాడలో ఏ కనెక్షన్ హాల్లో మంగళవారం జరిగిన కూటమి సమావేశంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు..
Updated at - Jun 12 , 2024 | 11:25 AM