Share News

NRI: ఎల్లలు దాటిన తర్వాత తెలుగు వారంతా ఒక్కటే: అంజాద్ బాషా

ABN , Publish Date - Jan 10 , 2024 | 11:37 AM

దేశ ఎల్లలు దాటిన తర్వాత రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు.

NRI: ఎల్లలు దాటిన తర్వాత తెలుగు వారంతా ఒక్కటే: అంజాద్ బాషా

సౌదీ అరేబియా: దేశ ఎల్లలు దాటిన తర్వాత రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు. స్వదేశానికి తిరిగి రావడానికి ముందు సోమవారం జెద్ధాలో తనను కలిసిన సౌదీ అరేబియాతెలుగు అసోసియేషన్ (సాటా) ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారంతా భారతదేశ ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు. దేశంలో ఆదర్శవంతంగా చెప్పే కేరళ రాష్ట్రం కంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఏపీ ఎన్నార్టీ సంస్థ ప్రవాసీయుల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. సామాజిక సేవలో తమ పని తీరును సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వివరించగా ఉప ముఖ్యమంత్రి వారిని అభినందించారు. కాగా ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శివ, సైమన్ పీటర్, రాంబాబు, ఫయాజ్, శాంతి తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 11:37 AM