Share News

Awareness : ఆహారం ఇలా సురక్షితం

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:24 AM

ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.

Awareness : ఆహారం ఇలా సురక్షితం

అవేర్‌నెస్‌

ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.

శుభ్రంగా ఉండేలా...

  • పదార్థాలను తాకేటప్పుడు, వంట వండేటప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి

  • టాయిలెట్‌ వాడిన ప్రతిసారీ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి

  • వంటకు ఉపయోగించే పరికరాలు (కత్తులు, చాపింగ్‌ బోర్డ్‌, మిక్సీ గిన్నెలు, పాత్రలు), ప్రదేశాలు శానిటైజ్‌ చేస్తూ ఉండాలి

  • వంటింట్లో ఎలుకలు, బొద్దింకలు, చీమలు లాంటివి లేకుండా చూసుకోవాలి

వీటిని వేర్వేరుగా...

  • పచ్చి మాంసం, గుడ్లు, సముద్రాహారాలను ఇతర పదార్థాలకు దూరంగా ఉంచాలి

  • కూరగాయలకూ, మాంసాహారినికీ ఒకే కత్తి, చాపింగ్‌ బోర్డ్‌, పాత్రలు ఉపయోగించకూడదు

  • పచ్చివాటినీ, ఉడికించిన వాటికీ వేర్వేరు పాత్రలు కేటాయించాలి

బాగా ఉడికించాలి

  • మాంసం, చేపలు, గుడ్లు, సముద్రాహారాలను బాగా ఉడికించాలి.

  • సూప్స్‌, స్ట్యూలను 70 డిగ్రీల సెంటేగ్రేడ్‌కు చేరుకునే వరకూ ఉడికించాలి. ఇవి చల్లారిపోతే, తిరిగి వేడి చేసిన తర్వాతే తినాలి


సురక్షితమైన తాపమానాల్లో...

  • వంటకాలను రెండు గంటలకు మించి గది ఉష్ణోగ్రతలో ఉంచకూడదు

  • పాడయ్యే వీలున్న పదార్థాలతో పాటు, వండిన వంటకాలన్నింటినీ 5 డిగ్రీల కంటే తక్కువ తాపమానంలో నిల్వ చేసుకోవాలి

  • వడ్డించే ముందు, పదార్థాలన్నీ 60 డిగ్రీల సెంటేగ్రేడ్‌కు మించి ఉండేలా చూసుకోవాలి

  • రెఫ్రిజిలేటర్‌లో పదార్థాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసి పెట్టుకోకూడదు

  • గడ్డకట్టిన పదార్థాలను గది ఉష్ణోగ్రతలో సాధారణ తాపమానానికి చేరుకునేలా వదిలేసి తినకూడదు

శుభ్రత ఇలా...

  • పాశ్చురైజ్‌డ్‌ పాలలా, సురక్షితమైన పద్ధతిలో ప్రాసెస్‌ చేసిన పదార్థాలను ఎంచుకోవాలి

  • సలాడ్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌ కోసం పండ్లు, కూరగాయలను కోసుకునే ముందు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి

  • అవెంత తాజాగా కనిపించినా, ఎక్పైరీ డేట్‌ దాటిన పదార్థాల జోలికి వెళ్లకూడదు.

Updated Date - Jun 11 , 2024 | 12:24 AM