Share News

Crime News: మహిళపై అరాచకం.. అలా చేసిందని అర్ధ నగ్నంగా ఊరేగింపు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:47 PM

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విచ్చలవిడితనం పేట్రేగిపోతోంది. తన మన అనే తేడా లేకుండా కొందరు అక్రమాలు, నేరాలకు ( Crime ) పాల్పడుతున్నారు. ఇంకొందరు విహహేతర సంబంధాల ఉచ్చులో బందీ అవుతున్నారు.

Crime News: మహిళపై అరాచకం.. అలా చేసిందని అర్ధ నగ్నంగా ఊరేగింపు..

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విచ్చలవిడితనం పేట్రేగిపోతోంది. తన మన అనే తేడా లేకుండా కొందరు అక్రమాలు, నేరాలకు ( Crime ) పాల్పడుతున్నారు. ఇంకొందరు విహహేతర సంబంధాల ఉచ్చులో బందీ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ లో అలాంటి ఘటనే జరిగింది. బార్మర్ జిల్లాలోని సర్వాది గ్రామానికి ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. గుట్టుగా సాగిన వీరి వ్యవహారం కొన్నాళ్లకు బయటపడింది. దీంతో ఇరు కుటుంబాల వారు హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అయినా వారిలో మార్పు రాలేదు. మరోసారి వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో ముందు గానే ప్లాన్ వేసిన వ్యక్తి తరఫు బంధువులు వారిని పట్టుకున్నారు. కోపంతో ఊగిపోయారు. విచక్షణ కోల్పోయి దుర్భాషలాడారు.

Kodali Nani: పకడ్బందీగా గురి చేసి కొట్టారు.. కొడాలి నాని


అంతటితో ఆగకుండా మహిళను వివస్త్ర చేసేందుకు ప్రయత్నించారు. అది సాధ్య పడక పోవడంతో అర్ధ నగ్నంగా చేసి ఊరేగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ వీడియోలో అర్ధ నగ్నంగా ఉన్న బాధితురాలిని ఒక మహిళ తన జుట్టుతో ఈడ్చుకుపోతుండటాన్ని చూడవచ్చు. ఈ ఘటనపై బాధితురాలు సమ్‌దారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 14 , 2024 | 03:47 PM