Share News

Lok Sabha Elections: తొలిసారి కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం కోల్పోయిన ఆ నలుగురు..

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:38 AM

స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసింది. సాధారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదురుకానుంది.

Lok Sabha Elections: తొలిసారి కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశం కోల్పోయిన ఆ నలుగురు..

స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసింది. సాధారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదురుకానుంది. రాజకీయంగా గాంధీ కుటుంబం అంటే ఇప్పుడు గుర్తొచ్చేది.. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు రాబర్ట్ వాద్రా. ఈ నలుగురికి కాంగ్రెస్‌ గుర్తుపై ఓటు వేసే అవకాశం లేదు.

Kangana Ranaut: నేను గొడ్డు మాంసం తినను.. కాంగ్రెస్ నేతకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..


పొత్తులో భాగంగా..

ఈ నలుగురు న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు. మరోవైపు చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లుగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబం చీపురు గుర్తుపై ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. గాంధీ కుటుంబం ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ హస్తం గుర్తుపై కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయలేరు. దీనికి కారణం ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉండటమే. పొత్తుల్లో భాగంగా న్యూఢిల్లీ సీటులో ఆప్ పోటీ చేస్తోంది. ఇక్కడి నుంచి ఆమాద్మీ అభ్యర్థిగా సోమనాథ్ భారతి పోటీ చేస్తుండగా, బిజెపి అభ్యర్థిగా దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్‌ ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రాలు ఆప్ గుర్తైన చీపురుపై ఓటు వేసే అవకాశం ఉంది.


కాంగ్రెస్ కోరినా..

న్యూడిల్లీ లోక్‌సభ సీటు తమకు కేటాయించాలని చివరి వరకు కాంగ్రెస్ కోరింది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు ఆప్ అంగీకరించలేదు. చాందినీచౌక్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించారు. ప్రస్తుతానికి చాందినీచౌక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్ మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో పార్టీకే గాంధీ కుటుబం ఓటు వేస్తుందని, దీనిని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదన్నారు. చాందినీచౌక్‌ పార్లమెంట్ స్థానంలో ఆప్ అభ్యర్థి పోటీలో లేకపోవడం వలన కేజ్రీవాల్ కుటుంబం కూడా ఇండియా కూటమి అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంటుందన్నారు.

PM Modi: రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ కూటమి కన్నెర్ర.. ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 11:38 AM