Share News

LokSabha Elections: అమిత్ షాకు లైన్ క్లియర్ చేస్తున్న మోదీ

ABN , Publish Date - May 24 , 2024 | 06:00 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

LokSabha Elections: అమిత్ షాకు లైన్ క్లియర్ చేస్తున్న మోదీ

న్యూఢిల్లీ, మే 24: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అమిత్ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్ నేతలు శివరాజ్ సింగ్, వసుందర రాజే, ఖతర్ సాహెబ్, డాక్టర్ రమణ్ సింగ్‌లను పక్కన పెట్టారని ఆరోపించారు.

నేడో రేపో యూపీ ప్రస్తుత సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను సైతం పక్కన పెడతారన్నారు. అందుకు సంబంధించిన ప్రచారం సైతం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడారు. 2019లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు.


బీజేపీలో 75 ఏళ్లు వచ్చినా.. ఆ వయస్సు దాటిన నాయకులంతా తప్పకుండా రిటైర్ కావాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారన్నారు. అందులో ఎటువంటి రాజీ లేదని అమిత్ షా చెప్పారన్నారు. కావాలంటే.. నాడు అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇంటర్నెట్‌లో చెక్ చేసుకోవచ్చునంటూ కేజ్రీవాల్ సూచించారు. అయితే ఆ రూల్ ప్రకారమే బీజేపీలోని సీనియర్లు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ తదితరులంతా పార్టీ నుంచి తప్పుకున్నారన్నారు. ఇటువంటి నేపథ్యంలో బీజేపీలో ప్రస్తుతమున్న నాయకాగణం సైతం ఆ రూల్‌ ప్రకారం నడుచుకోవాల్సిందేనని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

Badrachalam: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన ఆమె బంధువులు


ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తీహాడ్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ప్రచారం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌ వేశారు.

Indian Spices: భారతీయ మసాలాలు సేఫ్ భయపడొద్దు..!


ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇటీవల కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఢిల్లీలోని తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకొని కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Yadadri: భక్తులకు గుడ్ న్యూస్.. స్వామి వారి సేవలు ఇకపై ఆన్‌లైన్‌లో..


అందులోభాగంగా 2025, సెప్టెంబర్ 17వ తేదీతో ప్రదాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు వస్తాయన్నారు. బీజేపీ పెట్టుకున్న రూల్ ప్రకారం.. 75 ఏళ్లు వచ్చిన వారు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి ఉంటుదన్నారు. ఆ క్రమంలో మోదీ రిటైర్‌మెంట్ కాక తప్పదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరంటూ బీజేపీ నేతలకు సూటిగా కేజ్రీవాల్ సవాల్ విసిరారు.

Rajinikanth: రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా


దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. మూడోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే ఉంటారని అమిత్ షా స్పష్టం చేశారు. అటువంటి వేళ.. కేజ్రీవాల్ బీజేపీలో అమిత్ షాను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు మోదీ ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 06:35 PM