Share News

Rajinikanth: రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా

ABN , Publish Date - May 24 , 2024 | 04:30 PM

అబుదాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని రజనీకాంత్ తెలిపారు.

Rajinikanth: రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా

యూఏఈ, మే 24: అబుదాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని రజనీకాంత్ తెలిపారు. ఈ సందర్బంగా అబుదాబీ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. అలాగే తన స్నేహితుడు లూలు గ్రూప్ సీఎండీ యూసఫ్ ఆలీకు సైతం ఆయన కృతజ్జతలు తెలియజేశారు.

Yadadri: భక్తులకు గుడ్ న్యూస్.. స్వామి వారి సేవలు ఇకపై ఆన్‌లైన్‌లో..


ఈ వీసా అందుకున్న తర్వాత రజనీకాంత్.. అబుదాబీలోని బీఏపీఎస్ హిందూ దేవాలయానికి వెళ్లారు. దేవాలయంలోని కోలువు తీరిన స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ విశిష్టతతోపాటు నిర్మాణ శైలిని రజనీకాంత్‌కు ఆలయ పూజారులు వివరించారు. ఆ క్రమంలో రజనీ చేతికి ఆలయ పూజారి తాడు కట్టారు. అలాగే ఆయనకు పుస్తకాన్ని సైతం అందజేశారు.

Indian Spices: భారతీయ మసాలాలు సేఫ్ భయపడొద్దు..!


అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను దేవాలయం ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసింది. అలాగే తన స్నేహితుడు యూసఫ్ ఆలీతో కలిసి రోల్స్ రాయిస్ కార్లలో అబుదాబీ వీధుల్లో రజనీ విహరించారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం లూలు కంపెనీ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

Badrachalam: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన ఆమె బంధువులు


అబుదాబీ.. సాంస్కృతిక, పర్యాటక శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ చైర్మన్ మహ్మద్ ఖలీపా అల్ ముబారక్ చేతుల మీదగా రజనీకాంత్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


గోల్డెన్ వీసా అంటే ఏమిటి..?

యూఏఈ యేతర దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన వారికి ఈ ప్రత్యేక వీసాలను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఈ వీసాల‌కు 10 ఏళ్ల పాటు కాల‌ప‌రిమితి ఉంటుంది. అనంతరం అవే రెన్యువ‌ల్ అవుతాయి. ఈ గోల్డెన్ వీసాతో యూఏఈ పౌరులుగా అక్కడి ప్రభుత్వం క‌ల్పించే అన్ని ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే నూరు శాతం ఓన‌ర్‌షిప్‌తో యూఏఈలో వ్యాపారాలు సైతం చేసుకోవచ్చు. ఇక ఈ వీసా పొందిన వారు.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ దేశంలో దీర్ఘకాలికంగా నివ‌సించే వీలు కలిగి ఉంటారు.

2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు జారీ చేయడం యూఏఈ ప్రారంభించింది. ఈ గోల్డెన్ వీసాను అందుకున్న తొలి భారతీయ నటుడు, టాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌. అనంతరం సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి, మౌనీ రాయ్‌, ఫ‌రా ఖాన్‌, బోనీ క‌పూర్ ఫ్యామిలీ , నేహా క‌క్కర్‌, సింగ‌ర్ సోనూ నిగ‌మ్ ఈ వీసాను అందుకున్న వారిలో ఉన్నారు. అలాగే ఈ వీసాను అందుకున్న తొలి త‌మిళ కథానాయిక‌ త్రిష. ఆ తర్వాత అమ‌లాపాల్ ఈ వీసాను పొందారు. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో హీరోలు మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, టోవినో థామ‌స్‌, దుల్కర్ స‌ల్మాన్ సైతం ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు.

ఇక టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాస‌న సైతం ఈ గోల్డెన్ వీసా తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్‌ కూడా ఈ వీసా పొందారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతోపాటు షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 04:50 PM