Share News

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:13 AM

మరో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ( BJP ) ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అన్ని వర్గాల అభివృద్ధే కమలం పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 7

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..

మరో సారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ( BJP ) ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అన్ని వర్గాల అభివృద్ధే కమలం పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. పైపు లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్ అందజేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి చేస్తామని చెప్పారు. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సీనియర్ సిటిజెన్లతో పాటు ట్రాన్స్‌జెండర్లకూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తామని వివరించారు.

YCP: సీఎం జగన్‌పై విసిరిన రాయి ఘటనపై పలు అనుమానాలు..


బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను చూసుకున్నట్లయితే.. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు. కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం. నానో యూరియా వినియోగం మరింత పెంచడం వంటివి ముఖ్యమైనవి.


Elections 2024: త్వరలో రాష్ట్రంలో సంచలన ఘటనలు.. ముందే పసిగట్టిన నెటిజన్లు..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్‌ అవతరించేందుకు మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిస్టోను రిలీజ్ చేశారు. ‘మోదీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్‌’ పేరుతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 8:30కి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కలిసి ప్రధాని మోదీ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 14 , 2024 | 11:14 AM