Share News

Farmers Protest: మీ తీరు సరికాదు.. ఇంతటితో ఆపేయండి.. అన్నదాతలపై పోలీసుల జులుం..

ABN , Publish Date - Feb 21 , 2024 | 12:21 PM

తమ డిమాండ్ల సాధన కోసం శంభు సరిహద్దులో బుల్డోజర్ లతో రైతులు నిరసన చేపట్టారు. కంచెలు తెంచేసి దేశ రాజధాని వైపు తరలివచ్చేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

Farmers Protest: మీ తీరు సరికాదు.. ఇంతటితో ఆపేయండి.. అన్నదాతలపై పోలీసుల జులుం..

తమ డిమాండ్ల సాధన కోసం శంభు సరిహద్దులో బుల్డోజర్ లతో రైతులు నిరసన చేపట్టారు. కంచెలు తెంచేసి దేశ రాజధాని వైపు తరలివచ్చేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై హర్యానా పోలీసులు స్పందించారు. జేసీబీల యజమానులు, ఆపరేటర్లు దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. భద్రతా దళాలకు హాని కలిగించడానికి ఈ యంత్రాలు ఉపయోగించడం తీవ్రమైన నేరమని, నాన్ బెయిలబుర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. బారికేడ్లు, టియర్ షెల్స్ తో రైతులను అడ్డుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆందోళన నెలకొంది.

దేశ రాజధానిలోకి ప్రవేశించాలనే రైతుల ప్లాన్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కాంక్రీట్‌తో గోడలు కట్టడం, కంచెలు వేయడం తెలిసిందే. అయితే వీటిని దాటుకుని వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వాటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. బార్డర్ వద్ద బస్సులు, ట్రక్కులు, షిప్పింగ్ కంటైనర్‌లను బార్డర్స్ వద్ద ఉంచారు. జేసీబీలను తీసుకువచ్చారు. శాంతియుతంగా సాగుతున్న తమ నిరసనను అణిచివేయాలని చూడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని, రైతులను చంపడం ద్వారా వారి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తే అలాగే చేయాలని, కానీ తాము మాత్రం శాంతియుతంగానే ముందుకు సాగుతామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ వివరించారు.


శంభు సరిహద్దులో వందలాది ట్రాక్టర్లతో క్యాంప్ చేసి నిరసన తెలుపుతున్న రైతులపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్పందించింది. హైవేలపై ట్రాక్టర్ ట్రాలీలను ఉపయోగించరాదని పేర్కొంది. మోటారు వాహన చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. హక్కుల గురించి అందరికీ తెలుస్తాయి. కానీ రాజ్యాంగ విధులు కూడా ఉన్నాయని వాటిని ఎందుకు పాటించరు అని సూటిగా ప్రశ్నించింది.

బుల్‌డోజర్‌లు భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని హర్యానా పోలీసులు మంగళవారం పంజాబ్‌ అధికారులను కోరారు. అన్ని పంటల ఎమ్మెస్పీకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లపాటు కొన్ని పంటలపై కేంద్రం అందించిన ఎంఎస్‌పీని సోమవారం రైతులు తిరస్కరించారు. శంభు సరిహద్దులో 1200 ట్రాక్టర్లు, 300 కార్లతో పాటు దాదాపు 14,000 మంది రైతులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 21 , 2024 | 12:21 PM