Share News

Haryana: స్కూల్ బస్ బోల్తా.. ఏడుగురు చిన్నారులు మృతి..

ABN , Publish Date - Apr 11 , 2024 | 01:57 PM

హర్యానాలో ( Haryana ) ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది.

Haryana: స్కూల్ బస్ బోల్తా.. ఏడుగురు చిన్నారులు మృతి..

హర్యానాలో ( Haryana ) ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది. దీంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35-40 మంది విద్యార్థులు ఉన్నారు. సెలవు రోజు అయినప్పటికీ ప్రైవేటు పాఠశాల సెలవు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా స్కూల్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.


స్థానికుల ద్వారా ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు హుటాహుటిన స్పాట్ కు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయపడిన వారు ఆక్రందనలు, మృతుల కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.


Rains: సమయానికి ముందే వచ్చేస్తున్నాయ్.. భారీ వర్షాలు కురిపించేస్తాయ్..

ప్రమాదంపై హర్యానా విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠశాల నిర్వహించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడరని, చాలా వేగంగా డ్రైవింగ్ చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. దీంతో పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు.


ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు సహాయం అందిస్తున్నామని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 01:57 PM