Share News

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత.. రాహుల్ వాహనంపై రాళ్లదాడి..

ABN , Publish Date - Jan 31 , 2024 | 03:08 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ....

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత.. రాహుల్ వాహనంపై రాళ్లదాడి..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ఆహన వాహనంపై దాడి జరిగింది. హరిశ్చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాంగంజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వాహనంపై రాళ్లు రువ్వడంతో వాహనం వెనుక అద్దం పగిలిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ చౌదరి తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించినప్పటి నుంచి ఇండియా కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్ మధ్య పరిస్థితి గంభీరంగా మారింది. ఈ పరిస్థితిలోనే రాహుల్ వాహనంపై రాళ్ల దాడి జరగడం గమనార్హం.

గతంలో కూచ్ బిహార్ పట్టణంలో రాహుల్ గాంధీకి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లు చింపేశారు. రాహుల్ కు రాష్ట్ర అతిథి గృహంలో ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించిందని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ బంగా లోని ఆరు జిల్లాల మీదుగా 523 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర ఇప్పటికే డార్జిలింగ్, జల్పాయిగురి, అలీపుర్‌దువార్, నార్త్ దినాజ్‌పూర్‌లో సాగగా.. మాల్దా, ముర్షిదాబాద్‌లలో రెండో దశలో కొనసాగనుంది. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మార్చి 20న ముంబయిలో ముగుస్తుంది.

"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 31 , 2024 | 03:08 PM