Share News

Rahul Gandhi: ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 31 , 2024 | 03:28 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400 సీట్ల నినాదం సాధ్యం కాదని అన్నారు. ఈసారి 400 సీట్ల మార్క్ దాటేందుకు ప్రధాని మోదీ అంపైర్లను ఎంచుకున్నారని ఆరోపించారు.

Rahul Gandhi: ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలపై (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400 సీట్ల నినాదం సాధ్యం కాదని అన్నారు. ఈసారి 400 సీట్ల మార్క్ దాటేందుకు ప్రధాని మోదీ అంపైర్లను ఎంచుకున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party), ఇండియా కూటమి (INDIA Alliance) అగ్రనేతలు ఢిల్లీలో చేపట్టిన ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీలో (Loktantra Bachao Rally) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

LS Polls: రాజకుటుంబాలకు భారీగా టికెట్లు.. బీజేపీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?


రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ఈవీఎంలు (EVMs), మ్యాక్ ఫిక్సింగ్ (Match-Fixing), సోషల్ మీడియా (Social Media), ప్రెస్‌పై ఒత్తిడి లేకుండా బీజేపీ (BJP) 180 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలవలేదని తేల్చి చెప్పారు. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవడాన్ని క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని వివరణ ఇచ్చిన ఆయన.. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయని, ఇందుకోసం ప్రధాని మోదీ అంపైర్లను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల మ్యాచ్‌కి ముందే.. తమ జట్టు ఆటగాళ్లైన ఇద్దరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అని, కానీ ఎన్నికల ముందు తమ బ్యాంక్ ఖాతాలన్నీ మూసివేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం తాము ప్రచారాలు నిర్వహించాలని, కార్మికులను రాష్ట్రాలకు తరలించి పోస్టర్లు వేయాలని, కానీ బ్యాంక్ ఖాతాలు మూసివేస్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అసలు ఇవి ఎలాంటి ఎన్నిలకలని నిలదీశారు.

Trending: అదంతే.. సీరియల్ లో పెళ్లి చేసుకుంటే.. నిజ జీవితంలోనూ చేసుకున్నట్లే..!

పేదల నుండి రాజ్యాంగాన్ని లాక్కోవడం కోసం ప్రధాని మోదీ, 3-4 మంది క్రోనీ క్యాపిటలిస్టులు ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేస్తున్నారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. సీఎం కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను (Hemant Soren) అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఇప్పుడు రాబోయేది సాధారణ ఎన్నికలు కావని.. దేశాన్ని, రాజ్యాంగాన్ని (Constitution) కాపాడుకునే చివరి అవకాశమని ఉద్ఘాటించారు. ఒకవేళ పూర్తి స్థాయిలో ఓటు వేయకపోతే.. వారి మ్యాచ్ ఫిక్సింగ్ ఫలిస్తుందని చెప్పారు. అదే జరిగితే మాత్రం.. రాజ్యాంగం ధ్వంసమవుతుందని హెచ్చరించారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుక అని.. అది నాశనమైతే, దేశం అంతమవుతుందని వెల్లడించారు. 400కి పైగా సీట్లు వస్తే.. తాము రాజ్యాంగాన్ని మారుస్తామని ఓ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా రాహుల్ గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 03:31 PM