Share News

Trending: అదంతే.. సీరియల్ లో పెళ్లి చేసుకుంటే.. నిజ జీవితంలోనూ చేసుకున్నట్లే..!

ABN , Publish Date - Mar 30 , 2024 | 09:38 PM

సీరియల్స్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆడవారు మాత్రమే కాదండోయ్.. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ చూస్తుంటారు. కాలక్షేపం కోసం చాలా మంది వీటిని చూడటం బెస్ట్ ఆప్షన్ గా మార్చుకుంటారు. రీల్ లో జరిగే సీన్స్ అన్నీ రియల్ గానే జరుగుతున్నాయని భావిస్తుంటారు కొందరు.

Trending: అదంతే.. సీరియల్ లో పెళ్లి చేసుకుంటే.. నిజ జీవితంలోనూ చేసుకున్నట్లే..!

సీరియల్స్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆడవారు మాత్రమే కాదండోయ్.. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ చూస్తుంటారు. కాలక్షేపం కోసం చాలా మంది వీటిని చూడటం బెస్ట్ ఆప్షన్ గా మార్చుకుంటారు. రీల్ లో జరిగే సీన్స్ అన్నీ రియల్ గానే జరుగుతున్నాయని భావిస్తుంటారు కొందరు. తెలియని వాళ్లు అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ అన్నీ తెలిసిన వారు కూడా ఇదే మాట అంటే కోపం రాక మానదు. తాజాగా సీరియల్స్ విషయంలో పాకిస్తాన్ ( Pakistan ) ముస్లిం మత పెద్దలు చేసిన ప్రకటనలు ఆ దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సీరియల్స్ లో చేసుకునే రీల్ పెళ్లి.. రియల్ లైఫ్ లోనూ చెల్లుబాటు అవుతుందని వారు చేసిన కామెంట్స్ పాక్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Viral Video: అందుకే చెప్పేది.. కూల్ డ్రింక్స్ తాగొద్దని.. ఎందుకో ఈ వీడియో చూసేయండి..

నాటకాలు లేదా సీరియల్స్‌లో పాకిస్థానీ నటులు, నటీమణులు చేసుకునే వివాహం నిజ జీవితంలోనూ చెల్లుబాటు అవుతుందని చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. మౌలానా ప్రకటనపై పాకిస్థాన్ నటి, మోడల్ నదియా హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. టెలివిజన్ నాటకాల్లో జరిగే నిఖాలు పూర్తిగా అవాస్తవాలు అని, నటన కోసం మాత్రమే ఇలా చేయాల్సి వస్తుందని ఆమె అన్నారు. అయినప్పటికీ మౌలానా ప్రకటనను కొంత మంది వెనకేసుకురావడం గమనార్హం.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 09:39 PM