Share News

Lok Sabha Elections 2024: జూన్ 4న ఇండియా కూటమి నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం..

ABN , Publish Date - Jun 02 , 2024 | 09:33 AM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Lok Sabha Elections 2024: జూన్ 4న ఇండియా కూటమి నేతలతో రాహుల్, ఖర్గే సమావేశం..

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు జూన్ 4న ఇరువురు నేతలు ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 2న సైతం మధ్యాహ్నం 1 గంటలకు సమావేశం కానున్నారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కాంగ్రెస్, ఇండియా కూటమి భవిష్యత్తు వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు.


ఎవరెవరంటే..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, పార్టీల అగ్రనేతలు జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. శనివారం ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) బ్లాక్ సమావేశం ముగిసింది.

ఈ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ-ఎం, సీపీఐ, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్‌జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(శరద్ పవార్) సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి టీఎంసీ, పీడీపీలు గైర్హాజరయ్యాయి.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 09:34 AM