Share News

CEC: ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న నేతలు.. ఎయిమ్స్‌లను ప్రారంభించనున్న ప్రధాని..

ABN , Publish Date - Feb 19 , 2024 | 06:00 PM

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

CEC: ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న నేతలు.. ఎయిమ్స్‌లను  ప్రారంభించనున్న ప్రధాని..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ త్వరలోనే రావచ్చన ఊహాగానాల నేపథ్యంలో నేతలు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ రాకముందే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కాగా.. మార్చి రెండో వారంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం.

ఈ లోపే ఆయా మంత్రిత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి 7వ తేదీ వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దేశంలో కొత్తగా నిర్మించిన ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ఈ నెల 25 న జాతికి అంకితం చేయనున్నారు. 28 న వైజాగ్ లో హెచ్‪పీసీఎల్ కార్యక్రమంలో పాల్గొంటారు. 25న మంగళగిరి ఎయిమ్స్‌ సహా మొత్తం రూ.11,391.79 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


మంగళగిరి, రాజ్‌కోట్‌, భటిండా, రాయ్‎బరేలి, కళ్యాణి ఎయిమ్స్‌లు, పలు వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, పీఎం-అభిమ్‌ పథకంలో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ లేబొరేటరీలను ప్రధాని ప్రారంభిస్తారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం వేదికగా ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో నిర్మించిన అత్యాధునిక ఆహార భద్రత మౌలిక వసతులను కూడా ప్రారంభిస్తారు.

ఈనెల 25న జరిగే కార్యక్రమంలో మంగళగిరి ఎయిమ్స్‌, విశాఖపట్నంలో నిర్మించిన మైక్రో బయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, పీఎం-అభిమ్‌ పథకం కింద నిర్మించిన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు జాతికి అంకితం చేస్తారు. కాగా.. ఏపీలో మొత్తం రూ.1858.06 విలువైన ప్రాజెక్టుల్లో మంగళగిరి ఎయిమ్స్‌ ప్రాజెక్టుకే రూ.1618.23 కోట్లు కేటాయించడం విశేషం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 06:00 PM