Share News

Himachal Pradesh: కాంగ్రెస్‌కు రెబల్స్ ఝలక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:06 PM

హిమాచల్ ప్రదేశ్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. సానుకూల తీర్పు రాకపోవడంతో ఆరుగురు రెబల్స్ శనివారం నాడు (ఈరోజు) బీజేపీలో చేరారు.

Himachal Pradesh: కాంగ్రెస్‌కు రెబల్స్ ఝలక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ఆరుగురు కాంగ్రెస్ (Congress) రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్(Congress) పార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. సానుకూల తీర్పు రాకపోవడంతో ఆరుగురు రెబల్స్ శనివారం నాడు (ఈరోజు) బీజేపీలో (BJP) చేరారు. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, ఇందర్ దత్, దేవేంద్ర భుట్టొ, రాజేంద్ర రాణా, చైతన్య శర్మను హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ బింద్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.

స్వతంత్రులు కూడా

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలగా ఓటు వేసిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరతారు. ఆ ముగ్గురు శుక్రవారం నాడు ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తామని ఆశిష్ శర్మ, హొషియార్ సింగ్, కేఎల్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో స్థానిక బీజేపీ నేతకు ఓటు వేశామని హోషియర్ సింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింగ్వీ బయటి వ్యక్తి అని వివరించారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రతీకార చర్యలకు దిగిందని ఆరోపించారు. అందుకోసమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో దేశం మరింత శక్తిమంతం అవుతుందని అభిప్రాయ పడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Lok Sabha Polls: ఇండియా బ్లాక్‌లో చీలిక..? 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ

Updated Date - Mar 23 , 2024 | 03:06 PM