Share News

Loksabha Elections: ‘దక్షిణాదిలో గెలుపే కీలకం’

ABN , Publish Date - Apr 05 , 2024 | 08:14 PM

ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయన్నారు.

Loksabha Elections: ‘దక్షిణాదిలో గెలుపే కీలకం’
rajnath singh

న్యూఢిల్లీ, ఏప్రిల్ 05: ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయన్నారు.

వాటిలో మెజార్టీ స్థానాలు తమ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకొందని.. అందులో దక్షిణాదిలో గెలుచే స్థానాలే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.


ఇక 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం విజయం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో కర్ణాటకలో తమ స్థానం మరింత బలపడిందన్నారు.

అయితే గతంలో తమిళనాడు, కేరళలో అంతగా స్థానాలు గెలుచుకో పోయినప్పటికీ.. ఈ సారి మాత్రం అధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. అయితే ఎన్ని సీట్లు గెలుచుకుంటామని మాత్రం చెప్పలేమన్నారు. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ రాష్ట్రంలో బీజేపీ స్థానాలను గెలుచుకొంటుందన్నారు. దక్షిణాదిలో అంటే.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలలో కలిపి మొత్తం 130 లోక్‌సభ స్థానాలు‌ ఉన్నాయి.

మరిన్నీ జాతీయ వార్తలు కోసం

Sunita Kejriwal: సునీతా ది బెస్ట్... ఆప్ మంత్రి సౌరబ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు

Lok Sabha Elections: ముఖేష్ సహనీ వీఐపీతో ఆర్జేడీ పొత్తు... 3 సీట్లు కేటాయింపు

Updated Date - Apr 05 , 2024 | 08:19 PM