Share News

Lok Sabha Elections: ముఖేష్ సహనీ వీఐపీతో ఆర్జేడీ పొత్తు... 3 సీట్లు కేటాయింపు

ABN , Publish Date - Apr 05 , 2024 | 06:26 PM

బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టుదలగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ మరో పార్టీతో శుక్రవారంనాడు చేతులు కలిపింది. ముఖేష్ సహనీ సారథ్యంలోని వికాస్‌‌శీల్ ఇన్సాన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించింది. రెండు పార్టీల నేతలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Lok Sabha Elections: ముఖేష్ సహనీ వీఐపీతో ఆర్జేడీ పొత్తు... 3 సీట్లు కేటాయింపు

పాట్నా: బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టుదలగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (RJD) మరో పార్టీతో శుక్రవారంనాడు చేతులు కలిపింది. ముఖేష్ సహనీ సారథ్యంలోని వికాస్‌‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP)తో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించింది. రెండు పార్టీల నేతలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్జేడీ మహాకూటమిలోకి ముఖేష్ సహనీని ఆహ్వానిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. 400 సీట్లకు పైగా గెలుచుకుంటామని నినాదాలిస్తున్న వారికి (BJP) బీహార్ గడ్డపై నుంచే సరైన గుణపాఠం చెబుతామని అన్నారు.


ఆర్జేడీ 26 సీట్లలో పోటీ చేస్తోందని, తమ కోటా నుంచి ముఖేష్ సహనీ పార్టీకి గోపాల్‌గంజ్, ఝాంఝహార్‌పూర్, మోతిహారి లోక్‌సభ సీట్లు కేటాయిస్తున్నామని తేజస్వి యాదవ్ తెలిపారు. ముఖేష్ సహనీ మాట్లాడుతూ, లాలూ ప్రసాద్ సిద్ధాంతాలపై తమ పార్టీకి నమ్మకం ఉందన్నారు. తమ పార్టీ నేతలను లాక్కునేందుకు, పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు బీజేపీ, ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్టు ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తమ కూటమి చాలా బలంగా ఉందని, 40కి 40 స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Narendra Modi: పదేళ్లలో చేసింది కేవలం ట్రయిలరే... చేయాల్సింది చాలానే ఉంది

Updated Date - Apr 05 , 2024 | 06:26 PM