Share News

JMM: జేఎంఎం‌కు సీత సోరెన్ షాక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా, బీజేపీలో చేరిక

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:11 PM

జార్ఖండ్‌లో జేఎంఎంకు గట్టి షాక్ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు, జేఎంఎం నేత సీత సోరెన్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు. శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ సీత సోరెన్. అనారోగ్యంతో దుర్గా సోరెన్ మరణించారు. ఆ తర్వాత సీత సోరెన్‌ను శిబు సోరెన్ ఇతర కుటుంబ సభ్యులు పట్టించుకోలేదట.

JMM: జేఎంఎం‌కు సీత సోరెన్ షాక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా, బీజేపీలో చేరిక

రాంచీ: జార్ఖండ్‌లో జేఎంఎంకు (JMM) షాక్ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు, జేఎంఎం నేత సీత సోరెన్ (Sita Soren) పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు.

జేఎంఎంకు గుడ్ బై

శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ సీత సోరెన్. అనారోగ్యంతో దుర్గా సోరెన్ మరణించారు. ఆ తర్వాత సీత సోరెన్‌ను శిబు సోరెన్, ఇతర కుటుంబ సభ్యులు పట్టించుకోలేదట. సీత, ఆమె పిల్లలను ఇతర ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చేయలేదని వాపోయారు. మామ శిబు సోరెన్‌కు రాసిన లేఖలో తన బాధను సీత పంచుకుంది.

‘కుటుంబంలోనే కాదు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో విసిగిపోయా. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తోంది. తనకు, కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయడం తనకు తప్ప మరో మార్గం లేదు అని’ రాజీనామా లేఖలో సీత సోరెన్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 03:11 PM