Share News

Weather Report: రైతాంగానికి గుడ్ న్యూస్.. మరో 5 రోజుల్లో..

ABN , Publish Date - May 27 , 2024 | 03:22 PM

Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే..

Weather Report: రైతాంగానికి గుడ్ న్యూస్.. మరో 5 రోజుల్లో..
Weather Updates

Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ(IMD) గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు(Monsoon) వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను(Kerala) తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే.. వాయువ్య భారతదేశంలో మాత్రం తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి.

మరో 3 రోజుల పాటు తీవ్రమైన వేడి గాలుల ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ పశ్చిమ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. పశ్చిమ హిమాలయాలు, మధ్యప్రదేశ్ తూర్పు భాగం, విదర్భ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ హీట్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. మూడు రోజుల అనంతరం కొంత ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.


తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం..

ఇదిలాఉంటే.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, నల్లగొండ, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ప్రాంతంలో ఈదురు గాలుల కారణంగా ఖాళీ స్థలంలో వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోయాయి. వందలాది గుడిసెలు కొట్టుకుపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

For More National News and Telugu News..

Updated Date - May 27 , 2024 | 03:22 PM