Share News

Bengaluru: రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:11 PM

బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారి జరిగిన ఘటనతో నగరం ఉలిక్కిపడింది. రాజాజీనగర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Bengaluru: రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారి జరిగిన ఘటనతో నగరం ఉలిక్కిపడింది. రాజాజీనగర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్న భోజనం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో ముగ్గురు కేఫ్ సిబ్బందితో పాటు ఒక కస్టమర్ కు గాయాలయినట్లు సమచారం. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పేలుడు ( Explosion ) కు గల కారణాలు ఇంకా తెలియలేదు. సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రెస్టారెంట్‌లోని ఓ బ్యాగ్‌లో ఉంచిన వస్తువుకు పేలుడు స్వభావం ఉందని, అది పేలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. సమచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

మరోవైపు.. నగరంలోని 44 ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు ఇ-మెయిల్ లో పేర్కొన్నారు. వైట్‌ఫీల్డ్, కోరమంగళ, బస్వేష్‌నగర్, యలహంక, సదాశివనగర్‌ సహా బాంబు బెదిరింపు వచ్చిన అన్ని పాఠశాలలకు బాంబు స్క్వాడ్‌లను పంపించారు. విద్యార్థులను, సిబ్బందిని వెంటనే పాఠశాల నుంచి ఖాళీ చేయించారు.


మేము ఇ-మెయిల్ లో పేర్కొన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. తనిఖీ చేసేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఇంకా అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకోలేదని అని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర్ వెల్లడించారు. 24 గంటల్లో మెయిల్ పంపిన వారిని పట్టుకుంటామని, ఈ ఘటనను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 03:13 PM