Share News

Sandeshkhali Case: సందేశ్ ఖలీ కేసు.. షాజహాన్ సోదరుడు సహా ముగ్గురు అరెస్టు..

ABN , Publish Date - Mar 16 , 2024 | 09:29 PM

దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సందేశ్‌ఖలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ సోదరుడు ఆలంగీర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేసింది.

Sandeshkhali Case: సందేశ్ ఖలీ కేసు.. షాజహాన్ సోదరుడు సహా ముగ్గురు అరెస్టు..

దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సందేశ్‌ఖలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ సోదరుడు ఆలంగీర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేసింది. కోల్‌కతా ( Kolkata ) లోని నిజాం ప్యాలెస్‌లోని కార్యాలయంలో రోజంతా విచారించిన తర్వాత ఆలంగీర్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షాజహాన్ షేక్‌ను పోలీసులు మొదట అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించారు. ఈడీపై దాడికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం షాజహాన్ షేక్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని సందేశ్‌ఖలీలో షాజహాన్ షేక్ నిర్వహిస్తున్న ఇటుక బట్టీపై దాడి చేశారు. అతనిపై నమోదైన భూకబ్జా కేసుకు సంబంధించి ఈ దాడి జరిగింది. దాదాపు 55 రోజుల పాటు పరారీలో ఉన్న షాజహాన్ షేక్‌ను ఫిబ్రవరి 29న అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 09:32 PM