Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

BJP: బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎఫెక్ట్.. రాజకీయాలకు కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:58 PM

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల తొలి జాబితాపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లిస్ట్ విడుదల చేసిన 24 గంటలు గడవక ముందే కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

BJP: బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎఫెక్ట్.. రాజకీయాలకు కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్ సభ ఎన్నికల తొలి జాబితాపై కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ లిస్ట్ విడుదల చేసి 24 గంటలు గడవక ముందే పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ (Harsh Vardhan) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల (Politics) నుంచి వైదొలుగుతున్నానని ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఎందుకంటే..?

హర్షవర్ధన్ ఢిల్లీ చాందిని చౌక్ నుంచి లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. హర్షవర్ధన్ స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్‌కు టికెట్ కేటాయించింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని హర్షవర్ధన్ ప్రకటన చేశారు.

వాట్ నెక్ట్స్

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని హర్షవర్ధన్ ప్రకటించారు. తర్వాత తన వైద్య వృత్తికి అంకితం అవుతానని తెలిపారు. కృష్ణనగర్‌లో గల తన ఈఎన్‌టీ క్లినిక్‌కు వెళతానని, తిరిగి వైద్య సేవలు అందిస్తానని ప్రకటించారు. ‘గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఐదు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించా. రెండుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించా. భారతీయ జనతా పార్టీ పరంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పదవులు నిర్వహించా. ఇప్పుడు కెరీర్ ప్రారంభించిన వైద్య వృత్తి చేపట్టాల్సిన సమయం వచ్చింది, అందుకే క్లినిక్‌‌కు వెళతా అని’ హర్షవర్ధన్ ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 03 , 2024 | 02:58 PM