Share News

Delhi: ఢిల్లీ జోన్‌ విద్యార్థి వేద్‌ లాహోటికి ఫస్ట్‌ ర్యాంక్‌..

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:24 AM

జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లాహోటి 360 మార్కులకుగాను 355 మార్కులు సాధించి నెంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.

Delhi: ఢిల్లీ జోన్‌ విద్యార్థి వేద్‌ లాహోటికి ఫస్ట్‌ ర్యాంక్‌..

  • 355 మార్కులతో సరికొత్త రికార్డు.. నేటి నుంచి కౌన్సెలింగ్‌

  • ఢిల్లీ జోన్‌ విద్యార్థి వేద్‌ లాహోటికి ఫస్ట్‌ ర్యాంక్‌

  • 355 మార్కులతో సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ, జూన్‌ 9: జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లాహోటి 360 మార్కులకుగాను 355 మార్కులు సాధించి నెంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. 2022లో అప్పటి ఫస్ట్‌ ర్యాంకర్‌ సాధించిన 352 మార్కులే ఇప్పటి వరకూ అత్యధికం. తదుపరి ర్యాంకర్లలో ఆదిత్య (ఐఐటీ ఢిల్లీ జోన్‌)-2, భోగపల్లి సందేశ్‌ (ఐఐటీ మద్రాస్‌ జోన్‌)-3, రిథమ్‌ కేడియా (ఐఐటీ రూర్కీ జోన్‌)-4, పుట్టి కుశాల్‌ కుమార్‌ (ఐఐటీ మద్రాస్‌)-5, రాజ్‌దీప్‌ మిశ్రా (ఐఐటీ బాంబే జోన్‌)-6, ద్విజ ధర్మేశ్‌కుమార్‌ పటేల్‌ (ఐఐటీ బాంబే జోన్‌)-7, కోడూరి తేజేశ్వర్‌ (ఐఐటీ మద్రాస్‌ జోన్‌)-8, ధ్రువి హేమంత్‌ దోషి (ఐఐటీ బాంబే జోన్‌)-9, సిధ్విక్‌ సుహాస్‌ (ఐఐటీ మద్రాస్‌ జోన్‌)-10 ఉన్నారు. ఆలిండియా స్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన ద్విజ ధర్మేశ్‌కుమార్‌ పటేల్‌ 332 మార్కులతో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది.


కాగా, టాప్‌ 10 ర్యాంకర్లలో నలుగురు విద్యార్థులు ఐఐటీ మద్రా్‌సకు చెందిన వారు కావటం విశేషం. క్వాలిఫై అయిన విద్యార్థులలో కూడా ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు చెందిన వారే అధికంగా ఉన్నారు. కాగా, మే 26వ తేదీన జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షకు 1,80,200 మంది విద్యార్థులు హాజరుకాగా 48,248 మంది అర్హత సాధించారు. వీరిలో 7,964 మంది బాలికలు. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహించింది. సోమవారం నుంచి ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Updated Date - Jun 10 , 2024 | 03:24 AM