Share News

BJP: ఆ రెండు పార్టీలు కలిసి అవినీతి చేశాయి.. ఆమె బాధకు కేజ్రీవాలే కారణం.. బీజేపీ

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:34 AM

దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BJP: ఆ రెండు పార్టీలు కలిసి అవినీతి చేశాయి.. ఆమె బాధకు కేజ్రీవాలే కారణం.. బీజేపీ

దిల్లీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ మండిపడింది. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ( Kejriwal ) పడుతున్న బాధకు కేజ్రీవాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఆమె ఇంత బాధతో మాట్లాడడానికి అరవింద్ కేజ్రీవాల్ కారణం. ప్రభుత్వ సౌకర్యాలు, ఇల్లు, కారు, సెక్యూరిటీ తీసుకున్న రోజే మీడియా సమావేశం పెట్టి ఉంటే బాగుండేది. అరవింద్ కేజ్రీవాల్ ద్వారా రూ.100 కోట్ల లావాదేవీ జరిగినప్పుడు అయినా వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఉండాలి." అని వీరేంద్ర సూచించారు. శనివారం సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ను సునీతా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్ లో కలిశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీలో ఉంచారు.

"ఆప్ విధానాలకు కాంగ్రెస్ గతంలో విమర్శించింది. కానీ ఇప్పుడు వారికి మద్దతిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు షీలా దీక్షిత్, సోనియా గాంధీని విమర్శించేవారు. ప్రస్తుతం రాహుల్ గాంధీతో సామరస్యంగా మెలుగుతున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండూ కలిసి అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది."

వీరేంద్ర సచ్‌దేవా, దిల్లీ బీజేపీ అధ్యక్షుడు


కాగా.. అరవింద్ కేజ్రీవాల్ లేఖను ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. "నా ప్రియమైన దేశ ప్రజలారా.. నన్ను అరెస్టు చేశారు. నేను జైలులో ఉన్నా లేకపోయినా దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. నా జీవితమంతా దేశానికే అంకితం. నేను చాలా కష్టపడ్డాను. ఈ అరెస్టు నాకు ఆశ్చర్యం కలిగించలేదు" అని కేజ్రీవాల్‌ లేఖలో రాశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 10:34 AM