Share News

Lok Sabha Elections: యూపీలో హస్తం ట్రబుల్.. సీట్ల విషయంలో నేతల అసంతృప్తి..

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:50 PM

ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.

Lok Sabha Elections: యూపీలో హస్తం ట్రబుల్.. సీట్ల విషయంలో నేతల అసంతృప్తి..

ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది. గతంలో యూపీలో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథిలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓడిపోవడమే దీనికి నిదర్శనం.

ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది.దీంతో కాంగ్రెస్‌కు 17 సీట్లను కేటాయించగా.. మిగిలిన 63 సీట్లలో ఎస్పీతో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ను నమ్ముకున్న నాయకులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. దీంతో కొంతమంది సీనియర్లు కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో యూపీలో కాంగ్రెస్ ట్రబుల్‌లో ఉందనే విషయం స్పష్టమవుతోంది.

Congress: ‘గాలి’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి..

సీనియర్లకు నో టికెట్..

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవి వర్మ, ఆయన కుమార్తె పూర్వీ వర్మ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రవి వర్మ లఖింపూర్ ఖేరీ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రవి వర్మ కుమార్తె పూర్వి వర్మ 2019 ఎన్నికల్లో ఎస్పీ తరపున ఇదే లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో లఖింపూర్ ఖేరీ స్థానం నుంచి టికెట్ ఇస్తామని పూర్వి వర్మకు కాంగ్రెస్ హామీ ఇవ్వగా, సీట్ల పంపకంలో ఎస్పీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ సీటును అడుగుతోంది. సీట్ల సర్ధుబాటు పూర్తైనప్పటికీ.. ఈ ఒక్క సీటు విషయంలో తమకు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. ఆ సీటు వదులకునేందుకు ఎస్పీ ఇష్టపడటం లేదు. లఖింపూర్ ఖేరీ అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ ఉత్కర్ష్ వర్మను ప్రకటించింది. దీంతో పూర్వి వర్మ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశలు గల్లంతైనట్లు తెలుస్తోంది.

బీఎస్పీని వీడి..

మరోవైపు బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరిన నసీముద్దీన్ సిద్దిఖీ బిజ్నోర్ మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. సీట్ల సర్ధుబాటులో ఎస్పీ ఈ సీటును తీసుకుంది. దీంతో నసీముద్దీన్ సిద్ధిఖీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయినట్లయింది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే నసీముద్దీన్ సిద్దిఖీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

సల్మాన్ ఖుర్షీద్‌కు..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గతంలో ఎంపీగా ఎన్నికైన ఫరూఖాబాద్ సీటు ఎస్పీకి వెళ్లిపోయింది. సీట్ల పంపకానికి ముందే ఫరూఖాబాద్ స్థానానికి ఎస్పీ తన అభ్యర్థి పేరును ప్రకచింది. మరోవైపు సీట్ల సర్ధుబాటు కోసం కాంగ్రెస్ ఏర్పాటుచేసిన కమిటీలో సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు. దీంతో సల్మాన్ ఖుర్షీద్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకున్నారు. ఇండియా కూటమిగా ఏర్పడటం వల్ల కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మరింత బలహీన పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Bangalore: అబ్బో అధికారిక ఆస్తులే అన్ని ఉంటే.. ఇక అనధికారికంగా ఎన్ని ఉంటాయో.. డీకే ఆస్తులు రూ.593 కోట్లు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2024 | 04:50 PM