Share News

Tamil Nadu: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 25 , 2024 | 06:11 PM

ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్య పదజాలంతో విమర్శించారనే ఆరోపణలతో తమిళనాడు ( Tamil Nadu ) మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై తూత్తుకుడిలో కేసు నమోదైంది. తిరుచెందూర్ సమీపంలోని తండుపతు గ్రామంలో ఈ నెల 22న ఇండియా కూటమి సమావేశం జరిగింది.

Tamil Nadu: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు నమోదు

ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్య పదజాలంతో విమర్శించారనే ఆరోపణలతో తమిళనాడు ( Tamil Nadu ) మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై తూత్తుకుడిలో కేసు నమోదైంది. తిరుచెందూర్ సమీపంలోని తండుపతు గ్రామంలో ఈ నెల 22న ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ట్యుటికోరిన్ పార్లమెంటు సభ్యురాలు కనిమొళి, మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. కామరాజ్ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి, బీజేపీకి లేదని అనితా రాధాకృష్ణన్ తీవ్ర కామెంట్లు చేశారు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది.

Telangana: చీకట్లు నింపిన హోలీ.. నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి..

మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తూత్తుకుడిలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ తో పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 292/బి, అశ్లీల చర్యకు పాల్పడడం లేదా అసభ్యకరమైన పాట పాడడం వంటి చర్యల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 06:11 PM