Share News

JP Nadda: జేపీ నడ్డా భార్య కారు చోరీ

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:52 AM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్‌యూవీ కారు చోరీకి గురయ్యింది. దక్షిణ తూర్పు ఢిల్లీలో గల గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్‌ నుంచి కారు దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్‌కు ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్‌లో కారు కనిపించలేదు.

JP Nadda: జేపీ నడ్డా భార్య కారు చోరీ

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) భార్య ఎస్‌యూవీ కారు చోరీకి గురయ్యింది. దక్షిణ తూర్పు ఢిల్లీలో గల గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్‌ నుంచి కారు (Car) దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్‌కు ఇచ్చి డ్రైవర్ (Driver) తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్‌లో కారు కనిపించలేదు. వెంటనే పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా కారు గురుగ్రామ్ వైపు వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

జేపీ నడ్డా భార్య కారు ఈ నెల 19వ తేదీన చోరీకి గురయ్యింది. తెల్లని రంగు ఫార్చూనర్ కారు దొంగతనానికి గురయ్యిందని ఫిర్యాదులో డ్రైవర్ జోగిందర్ పేర్కొన్నారు. కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. కారు నంబర్ హెచ్‌పీ 03 డీ 0021 అని ఫిర్యాదులో డ్రైవర్ వెల్లడించారు. కారు ఎక్కడ ఉందో కనుగొనేందుకు పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Ujjain:హోలీ పర్వదినాన విషాదం.. ఉజ్జయిని ఆలయంలో మంటలు చెలరేగి..

Updated Date - Mar 25 , 2024 | 11:49 AM