Share News

Lok Sabha Elections 2024: అక్కడ బీజేపీ నయా స్ట్రాటజీ.. కొన్ని స్థానాల్లో ముందుగా అభ్యర్థుల ప్రకటన

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:21 AM

లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం కొత్త ఎత్తుగడ వేసింది.

Lok Sabha Elections 2024: అక్కడ బీజేపీ నయా స్ట్రాటజీ.. కొన్ని స్థానాల్లో ముందుగా అభ్యర్థుల ప్రకటన

లక్నో: లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ (BJP) అనుకుంటోంది. ఆ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌పై (Uttar Pradesh) ప్రత్యేక దృష్టిసారించింది. ఇక్కడ బీజేపీ (BJP) ప్రభుత్వం అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో యూపీ (UP) నుంచి ఎక్కువ లోక్ సభ సీట్లు సాధించాలని వ్యుహా రచన రచించింది. ఇందుకు సంబంధించి కొత్త ఎత్తుగడ వేసింది.

జనాల్లోకి వెళ్లేందుకు అవకాశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ శనివారం నాడు ఢిల్లీలో ఎన్నికల గురించి సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాల గురించి ప్రతిపాదన వచ్చింది. ఆయా స్థానాల్లో ముందుగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే బాగుంటుందని అనుకున్నారని తెలిసింది. ఇలా చేయడంతో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు జనాల్లోకి వెళ్లడానికి ఎక్కువ సమయం ఉంటుందని అంచనా వేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే యూపీలో బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు.

కాంగ్రెస్- ఎస్పీ పొత్తు తర్వాత

ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 62 సీట్లను గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో అంతకుమించి సీట్లు గెలువాలని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. 63 చోట్ల ఎస్పీ, 17 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారు. ఆ వెంటనే బీజేపీ కొత్త ఎత్తుగడ వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 08:21 AM