Share News

BJP: ఢిల్లీలో బీజేపీ నేతల కీలక భేటీ.. మంత్రివర్గంలో ఎవరెవరంటే..?

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:24 PM

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

BJP: ఢిల్లీలో బీజేపీ నేతల కీలక భేటీ.. మంత్రివర్గంలో ఎవరెవరంటే..?
Narendra Modi

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఈసమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక నాయకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే పక్ష నేతగా మోదీని ఎన్నుకున్న నేపథ్యంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనేపథ్యంలో మోదీ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి.. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేదానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈసమావేశంలో ఆయా పార్టీల నేతలు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రమంత్రిమండలిలో తమకు కావాల్సిన పోర్ట్‌పోలియోల గురించి బీజేపీ జాతయ అధ్యక్షులు అమిత్‌ షా, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గంలో ఏయే పక్షాలకు అవకాశం కల్పించాలి.. ఏయే శాఖలు కూటమిలో భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది.

TS News: కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి?


అన్ని అంశాలపై సుదీర్ఘంగా..

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాకపోవడంతో కూటమిలో భాగస్వామ్య పక్షాల మద్దతు తప్పనిసరైంది. ఇప్పటికే మోదీ ప్రధాని అభ్యర్థిత్వానికి కూటమిలో భాగస్వామ్య పార్టీలు అంగీకారం తెలిపాయి. భవిష్యత్తుల్లో ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేకుండా ఉండేవిధంగా ఇప్పటినుంచే బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కూటమిలోని పార్టీలతో ఎటువంటి పేచీ లేకుండా ఉండేలా మంత్రివర్గం కూర్పు ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రివర్గ కూర్పుపై ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్‌ షా, రాజ్‌నాధ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబళె హాజరయ్యారు.


PM Modi: 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ రోజే ఎందుకు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 06 , 2024 | 01:02 PM