Share News

Uttar Pradesh: యూపీలో బీజేపీ కూటమి హవా.. తేలిపోనున్న ఎస్పీ: ఇండియా టీవీ సర్వే

ABN , Publish Date - Apr 03 , 2024 | 08:27 PM

లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటనున్నాయి. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. 77 సీట్లను బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. సమాజ్ వాదీ పార్టీ, ఇండియా కూటమి కలిసి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని పేర్కొంది.

Uttar Pradesh: యూపీలో బీజేపీ కూటమి హవా.. తేలిపోనున్న ఎస్పీ: ఇండియా టీవీ సర్వే

లక్నో: లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP), ఆ పార్టీ మిత్రపక్షాలు ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటనున్నాయి. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. 77 సీట్లను బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. సమాజ్ వాదీ పార్టీ (SP), ఇండియా కూటమి కలిసి కేవలం 3 సీట్లే పరిమితం అవుతుందని పేర్కొంది. ఒపీనియన్ పోల్ ప్రకారం ఫేమస్ టీవీ యాక్టర్ అరుణ్ గోవిల్ మీరట్‌లో ముందంజలో ఉన్నారని పేర్కొంది. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలిలో బీజేపీ ఆధిక్యంలో ఉందని వివరించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాయ్ బరేలితోపాటు అమేథి కాంగ్రెస్ కంచుకోట. గాంధీ-నెహ్రూ కుటుంబాలను ఇక్కడి ప్రజలు ఆదరించారు. గత ఎన్నికల్లో అమేథిలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?


Lok Sabha Polls: టోల్‌ బాదుడుకు 2 నెలల విరామం

Updated Date - Apr 03 , 2024 | 08:29 PM