Share News

Elon Musk: జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్: ఎలాన్ మస్క్ సంచలనం

ABN , Publish Date - Feb 23 , 2024 | 05:56 PM

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకొస్తామని ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Elon Musk: జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్: ఎలాన్ మస్క్ సంచలనం

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ కొనుగోలు చేసి, దానిని ఎక్స్‌గా (X) మార్చిన సంగతి తెలిసిందే. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్ (X-Mail) తీసుకొస్తామని ప్రకటించారు. త్వరలో ఎక్స్ మెయిల్ అందుబాటులోకి వస్తోందని మస్క్ ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీ మెయిల్ ఉపయోగిస్తున్న మరొకరు స్పందిస్తూ.. జంక్ మెయిల్ కోసం హట్ మెయిల్ ఉపయోగిస్తున్నానని వివరించారు. గూగుల్‌కు చెందిన జీ మెయిల్ సూర్యాస్తమయం ఫొటో సోషల్ మీడియా ఎక్స్‌లో ఆగస్ట్‌ నెలలో కనిపించింది. ఆ పోస్ట్ రావడం, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎక్స్ మెయిల్ ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఆ ఫొటో ఫేక్ అని, జీ మెయిల్ సర్వీస్ ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. దీంతో రెగ్యులర్ యూజర్లు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. జీ మెయిల్‌కు ఎక్కువ మంది యూజర్లు ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 05:56 PM