Share News

Monsoon Health Tips: రోగ నిరోధక శక్తిని పెంచే 5 బెస్ట్ ఫుడ్స్..

ABN , Publish Date - Jul 09 , 2024 | 10:53 AM

Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి వాతావరణం, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వలన అనారోగ్యాలను దూరం చేయడంతో పాటు..

Monsoon Health Tips: రోగ నిరోధక శక్తిని పెంచే 5 బెస్ట్ ఫుడ్స్..
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి వాతావరణం, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం వలన అనారోగ్యాలను దూరం చేయడంతో పాటు.. ఆరోగ్యంగా ఉంటారు. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం చాలా కీలకం. మీరు ఉదయం తినే అల్పాహారంలో పోషకాహారం చేర్చుకోవడం వలన ఈ సీజన్‌లో హెల్తీగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే.. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు 5 రుచికరమైన, రోగనిరోధక శక్తిని పెంచే అల్పాహార వంటకాల గురించి తెలుసుకుందాం..


పసుపు, అల్లంతో వోట్మీల్..

కావలసినవి:

👉 1 కప్పు వోట్స్

👉 2 కప్పుల నీరు లేదా పాలు

👉 1 టీస్పూన్ పసుపు పొడి

👉 1 టీస్పూన్ తురిమిన అల్లం

👉 తేనె లేదా మాపుల్ సిరప్ (రుచికి సరిపడా వేసుకోవాలి)

తయారీ విధానం..

👉 ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో నీరు/పాలు పోసి మరిగించండి.

👉 ఆ తరువాత ఓట్స్, సరిపడా పసుపు, తురుమిన అల్లం కలపండి.

👉 మీడియం వేడి మీద ఉడికించాలి. అప్పుడప్పుడు దానిని కలపాలి. వోట్స్ ఉడికేంత వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచాలి.

👉 ఆ తరువాత తేనే, మాపుల్ సిరప్‌తో మిక్స్ చేయొచ్చు. కావాలనుకుంటే డ్రైఫ్రూట్స్, పండ్లతో డిజైన్ చేయొచ్చు.

👉 ఇప్పుడు వేడి వేడి, ఆరోగ్యకరమైన.. జింజర్, టర్మరిక్ ఓట్‌మీట్స్ తినొచ్చు.

👉 దీనిని ఉదయం సమయంలో అల్పాహారంగా తినడం వలన వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


బచ్చలికూర, మష్రూమ్, ఎగ్ వైట్ మిక్స్..

కావలసినవి:

👉 4 గుడ్లు తీసుకుని, అందులో తెల్లసొన తీసుకోవాలి.

👉 1 కప్పు తరిగిన బచ్చలికూర

👉 1/2 కప్పు ముక్కలు చేసిన పుట్టగొడుగులు

👉 1/4 కప్పు ముక్కలు చేసిన ఉల్లిపాయలు

👉 ఉప్పు, మిరియాలు (రుచికి సరిపడా)

👉 వంట కోసం ఆలివ్ నూనె

తయారీ విధానం..

👉 మీడియం వేడి మీద పాన్లో ఆలివ్ నూనెను వేడి చేయండి.

👉 ఉల్లిపాయలు వేసి.. లేత ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆపై పుట్టగొడుగులను వేసి లేత ఎరుపు రంగు వచ్చే వరకు ఉడికించాలి.

👉 తరిగిన బచ్చలికూర వేసి ఫ్రై మాదిరిగా ఉడికించాలి.

👉 ఇప్పుడు గుడ్డులోని తెల్లసొన వేయాలి. ఉప్పు, మిరియాలు వేసి ఉడికేంత వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

👉 వేడి వేడి హెల్తీ ఫుడ్‌ను ఉదయాన్నే తినడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.


మసాలా ఓట్స్ ఉప్మా..

కావలసినవి:

👉 1 కప్పు వోట్స్

👉 1 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు

👉 1 చిన్నగా కట్ చేసిన టమోటా

👉 1 పచ్చిమిర్చి, సన్నగా తరిగినవి

👉 1/2 టీస్పూన్ ఆవాలు

👉 1/2 టీస్పూన్ జీలకర్ర గింజలు

👉 కొన్ని కరివేపాకు

👉 రుచికి సరిపడా ఉప్పు

👉 ఈ ఫుడ్‌ని అందంగా కనిపించడం కోసం కాస్త కొత్తిమీర, పూదీనను సిద్ధం చేసుకోవాలి.

👉 నిమ్మరసం (ఐచ్ఛికం)

తయారీ విధానం..

👉 బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి.

👉 ఆ తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు దోరగా మాగే వరకు వేయించాలి.

👉 ఇప్పుడు తరిగిన టమాటా వేసి బాగా ఉడికించాలి.

👉 ఇప్పుడు వోట్స్, సరిపడా నీరు, తగినంత ఉప్పు వేయాలి. మెత్తగా ఉడికించాలి.

👉 వోట్స్ ఉడికిన తరువాత కాస్త కొత్తిమీర ఆకులు పైన వేసి.. కొంత నిమ్మరసం పిండుకోవాలి.

👉 వోట్స్‌లో ఫైర్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాన్ని ఉదయం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.


బాదం పాలతో క్వినోవా సూప్..

కావలసినవి:

👉 1 కప్పు క్వినోవా

👉 2 కప్పులు బాదం పాలు

👉 1 టేబుల్ స్పూన్ తేనె లేదా మాపుల్ సిరప్

👉 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి

👉 మరింత టేస్ట్ కోసం తరిగిన డ్రైఫ్రూట్స్

తయారీ విధానం..

👉 ముందుగా ఒక పాన్ తీసుకోవాలి.

👉 ఇప్పుడు బాదం పాలు వేయాలి.

👉 ఆ తరువాత క్వినోవా వేయాలి.

👉 ఇప్పుడు రెండింటినీ బాగా ఉడికించాలి.

👉 తేనే గానీ మాపుల్ సిరప్ వేసి కలపాలి. కాస్త దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి.

👉 15 నిమిషాల్లో ఈ హెల్తీ ఫుడ్ రెడీ అవుతుంది.

👉 మరిన్ని పోషకాల కోసం డ్రైఫ్రూట్స్, వాల్ నట్స్ వంటివి యాడ్ చేసుకోవచ్చు.


వెజిటబుల్ బేసన్ చీలా..

కావలసినవి:

👉 1 కప్పు శనగ పిండి (బేసన్)

👉 1/2 కప్పు సన్నగా తరిగిన మిశ్రమ కూరగాయలు (బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు, టమోటాలు, బచ్చలికూర)

👉 1 పచ్చిమిర్చి. సన్నగా తరగాలి.

👉 1/2 టీస్పూన్ పసుపు పొడి.

👉 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి.

👉 రుచికి సరిపడా ఉప్పు.

👉 అవసరమైనంత నీరు.

👉 అలంకరించు కోసం తాజా కొత్తిమీర ఆకులు.

👉 వంట కోసం ఆలివ్ నూనె.

తయారీ విధానం..

👉 ఒక గిన్నెలో శెనగపిండి, తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి.

👉 పిండి గడ్డలు కట్టకుండా నీటిని పోస్తూ బాగా కలపాలి.

👉 నాన్-స్టిక్ పాన్ లేదా స్కిల్లెట్‌ను మీడియం మంట మీద వేడి చేసి.. ఆలివ్ నూనెతో కొద్దిగా రుద్దాలి.

👉 పాన్‌పై పిండిని పోసి గుండ్రని చపాతీ ఆకారంలో వేయండి.

👉 రెండు వైపులా దోరగా, గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి.

👉 ఆ తరువాత తాజా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి.. వేడి వేడిగా చట్నీ లేదా పెరుగుతో ప్రొటీన్-ప్యాక్డ్, ఫైబర్-రిచ్ ఫుడ్‌ని అల్పాహారంగా తినేయొచ్చు.


Also Read:

ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

గ్రేటర్‌లో కొత్త సబ్‌స్టేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌..

ముజ్రా పార్టీలో ఢిల్లీ అమ్మాయిలు.. పోలీసులు వెళ్లే సరికే..!

For More Health News and Telugu News..

Updated Date - Jul 09 , 2024 | 10:53 AM