Share News

Fruits Adulteration: పుచ్చకాయ, మామిడి పండ్లకు పురుగు మందుల ఇంజెక్షన్లు.. కనిపెట్టండిలా

ABN , Publish Date - May 02 , 2024 | 11:13 AM

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

Fruits Adulteration: పుచ్చకాయ, మామిడి పండ్లకు పురుగు మందుల ఇంజెక్షన్లు.. కనిపెట్టండిలా

Health: కాదేదు కల్తీకి అనర్హం.. కల్తీ లేని ఆహారం అంటే బంగారం కంటే ఎక్కువగా చూసే రోజుల్లో ఉన్నాం. మనం తినే ఆహారం కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడమే చాలా కష్టంగా మారింది. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.

కాలానుగుణంగా కాసే పళ్లు త్వరగా పండటానికి పురుగు మందులు వాడటంతో ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపంలా మారింది. అవి తిన్న వారికి అజీర్తి, వాంతులు, విరేచనాలు, జ్వరం, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతోపాటు.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. మరి కల్తీలను గుర్తించడమెలా.. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

కల్తీ జరుగుతోందిలా..

కూరగాయల్లో ముఖ్యంగా అకుపచ్చ రంగులో ఉండే కాకర, బెండ, పాలకూర మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకొని కల్తీ(Fruits Adulteration) చేస్తున్నారు. కూరగాయలు తాజాగా కనిపించడానికి మలాసైట్‌ గ్రీన్‌ అనే అకువచ్చని రసాయనంలో, వివిధ పురుగు మందుల్లో, ఇతర రసాయనాల్లో ముంచి తీస్తారు.

చివరగా వీటిపై మైనపు పూతను పూస్తారు. తద్వారా అవి తాజాగా కనబడతాయి. పళ్లు మగ్గపెట్టడానికి కాల్షియం కార్బైడ్‌ అనే రసాయనాన్ని వినియోగిస్తున్నారు. కాలియం కార్బైడ్‌ను గ్యాస్‌ వెల్డింగ్ ద్వారా ఇనుప పరికరాలను అతికించడానికి, టపాసుల తయారీలో వాడతారు. ఇది ఎసిటిలీన్‌ వాయువును విడుదల చేసి పళ్లు త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతాయి.


పుచ్చకాయ, మామిడి పండ్ల కల్తీ..

ఎండకాలం కావడంతో పుచ్చకాయలు(Watermelons), మామిడిపండ్లు(Mangoes) త్వరగా మగ్గడానికి ప్రమాదకరమైన రసాయనాలను పళ్లకి ఎక్కిస్తున్నారు. కాయ త్వరగా మగ్గడానికి, ఆకర్షణీయమైన రంగులో కనబడటానికి, తియ్యదనం రావడానికి ఇష్టానుసారంగా పురుగు మందులు వాడుతున్నారు.

పుచ్చకాయ, యాపిల్, బత్తాయి, మామిడి పళ్ళలోకి రంగులను లేదా తీపి పదార్థాలను ఇంజెక్షన్‌ ద్వారా లోపలికి ఎక్కించి కల్తీ చేస్తారు. ఈ విధమైన కల్తీని గుర్తించడానికి మొదట కాయను పొటాషియం పర్మాంగనేట్‌, వెనిగర్‌ లేదా ఇతర ద్రావణాలతోను బాగా రుద్ది కడగాలి. తరువాత అ కాయను అలాగే రెండు రోజులు ఉంచాలి. కాయలోపలికి ఏమైన కృత్రిమ రసాయనాలు ఎక్కించినట్లయితే అది పులిసిపోయి వాసన వస్తుంది.

రంధ్రాల నుండి నురుగుతో కూడిన నీరు కారుతుంది. అప్పుడు కాయ కల్తీ జరిగినట్లు గుర్తించవచ్చు. అరటి పండ్లు ముదురు పసుపు వర్ణంలో ఉండి చిన్న చిన్న గోధుమ, నలుపు మచ్చలు ఉంటాయి. కాడలు నలుపు రంగులో ఉంటాయి. కాల్షియం కార్బైడ్ తో కృత్రిమంగా పండిన పండ్లు నిమ్మపసుపు రంగులో ఉండి కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయమొత్తం పసుపు వర్ణంలో ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. రుచి సరిగ్గా ఉండదు. నీటిలో మామిడి పండ్లు మునిగితే పండ్లు సహజంగా పండినవిగా గుర్తించాలి. నీటిలో తేలితే కల్తీ జరిగిందని అనుకోవచ్చు.

కూరగాయల్లో కల్తీ..

కూరగాయలు పచ్చగా, ఫ్రెష్‌గా కనిపించడానికి మలాసైట్‌ గ్రిన్‌ అనే ఆకుపచ్చని రసాయన ద్రావణంలో ముంచుతారు. దీనిని ఉపయోగించడం చాలా హానికరం. కూరగాయలు కల్తీ జరిగిన విషయం గుర్తించడానికి దూదిని తీసుకొని పారాఫిన్‌ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టి వెజిటెబుల్స్ ఉపరితలంపై రుద్దాలి. ఒకవేళ దూది అకుపచ్చ రంగుకు మారితే ఆ కూరగాయ మలాసైట్‌ గ్రీన్‌ రసాయనంతో కల్తీ చేశారని అర్థం చేసుకోవచ్చు.


వచ్చే సమస్యలివే..

రసాయనాలు పూసిన, కృత్రిమంగా మగ్గబెట్టిన కూరగాయలను, పళ్లను తినడం ద్వారా నోటిలో అల్సర్లు, ఉదర సంబంధ సమస్యలు, అతిసారం, చర్మం మీద దదుర్లు వస్తాయి. యుక్త వయస్సులో వృద్దాప్య ఛాయలు వస్తాయి. క్యాన్సర్‌, గుండె వ్యాధులు, గుండెనొప్పి, కీళ్ళనొప్పి, అలర్జీలు వస్తాయి.

గర్భంతో ఉన్న మహిళలు తింటే గర్భస్రావం జరిగే ప్రమాదమూ ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ లోపాలతో పుట్టే అవకాశమూ లేకపోలేదు. ఈ మధ్య కాలంలో కల్తీలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. సో బి కేర్ ఫుల్. కల్తీ జరిగిన ఆహార పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం మంచిది.

For Latest News and Health News click here

Updated Date - May 02 , 2024 | 11:13 AM