Share News

Elections 2024: ఈవీఎం బటన్‌ను ఎక్కువసార్లు నొక్కితే ఏమవుతుంది.. ఓట్లు పెరుగుతాయా..!

ABN , Publish Date - May 07 , 2024 | 09:13 AM

ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండుగ ఎన్నికలు.. ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఓటర్లకు సహజంగా వచ్చే అనుమానాలు కొన్ని అయితే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల ఆరోపణలతో మరిన్ని అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది. మనం వేసిన ఓటు వేసిన పార్టీకే పడుతుందా.. వేరు పార్టీకి పడుతుందా..

Elections 2024: ఈవీఎం బటన్‌ను ఎక్కువసార్లు నొక్కితే ఏమవుతుంది.. ఓట్లు పెరుగుతాయా..!
EVM

ఓట్ల పండుగ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పండుగ ఎన్నికలు.. ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎంతోమందికి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. ఓటర్లకు సహజంగా వచ్చే అనుమానాలు కొన్ని అయితే.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల ఆరోపణలతో మరిన్ని అనుమానాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈవీఎం ఎలా పనిచేస్తుంది. మనం వేసిన ఓటు వేసిన పార్టీకే పడుతుందా.. వేరు పార్టీకి పడుతుందా.. ఈవీఎంలో బటన్ ఎక్కువసార్లు నొక్కితే ఓట్లు పెరుగుతాయా.. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువసార్లు ఈవీఎంలో బటన్ నొక్కితే ఏమవుతుంది. ఈవీఎంలో చాలా బటన్లు ఉంటాయి.. పోటీలో తక్కువమంది ఉన్నప్పుడు ఖాళీ బటన్లు నొక్కితే ఏమవుతుంది.. ఇలా ఎన్నో సందేహలు ఓటర్లలో వస్తుంటాయి. మూడోవిడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈవీఎం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!


రెండు యూనిట్లతో అనుసంధానం..

EVM రెండు యూనిట్లతో తయారు చేస్తారు. ఒకటి కంట్రోల్ యూనిట్. రెండోది బ్యాలెట్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉంటుంది. బ్యాలెట్ యూనిట్‌లో ఓటరు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ యూనిట్‌లో అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తు ఉంటుంది. దాని ఎదురుగా ఓటు వేయడానికి ఒక బటన్ ఉంటుంది. రెండు యంత్రాలు ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు. బ్యాలెట్ యూనిట్‌లో ఓటును ప్రిసైడింగ్ అధికారి రిలీజ్ చేస్తేనే ఈవీఎంలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.


ఎక్కువ సార్లు ఈవీఎంలో బటన్ నొక్కితే..

ఓటరు బ్యాలెట్ యూనిట్‌లోని బటన్‌ను నొక్కిన వెంటనే అతని ఓటు నమోదవుతుంది. ఆ వెంటనే ఈవీఎం లాక్ అవుతుంది. ఒకసారి లాక్ అయిన తర్వాత.. దానిని కంట్రోల్ యూనిట్ నుంచి అన్‌లాక్ చేసే వరకు ఎన్నిసార్లు నొక్కినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ ఓట్లను ఈవీఎం తీసుకోదు. ప్రిసైడింగ్ అధికారి కంట్రోల్ యూనిట్‌లోని బ్యాలెట్ బటన్‌ను నొక్కే వరకు యంత్రం లాక్ చేయబడి ఉంటుంది. బ్యాలెట్ బటన్ నొక్కితే ఈవీఎం అన్‌లాక్ అవుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే ఈవీఎంలో బటన్ నొక్కగలరు.


ఖాళీగా ఉన్న బటన్లు నొక్కితే..

ఒక ఈవీఎంలో 16 బటన్లు మాత్రమే ఉంటాయి. దీంతో 16 మందిలోపు అభ్యర్థులు ఉన్నచోట ఒక ఈవీఎంనే ఉపయోగిస్తారు. ఒక నియోజకవర్గంలో కేవలం 10 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ఈవీఎంలో 16 బటన్లు ఉంటాయి. ఓటరు 11 నుంచి 16 వరకు ఏదైనా బటన్ నొక్కితే ఓటు వృధా అవుతుందేమోననే అపోహ చాలామందిలో ఉండొచ్చు. కాని ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం పోటీలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో అన్ని బటన్లు మాత్రమే పనిచేసేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారు. దీంతో మిగిలిన బటన్లు పనిచేయకుండా లాక్ చేస్తారు. దీంతో ఓట్లు వృధా అయ్యే ఛాన్స్ లేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.


కరెంట్ లేకపోతే..

కరెంట్ లేకపోతే ఈవీఎం పనిచేస్తుందా లేదా అనే అనుమానం చాలామందిలో ఉండొచ్చు. ఈవీఎంలు సాధారణ 7.5 వోల్ట్ ఆల్కలీన్ పవర్-ప్యాక్‌తో పనిచేస్తాయి. వీటిని బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేస్తున్నాయి. దీంతో విద్యుత్ కనెక్షన్ లేకుండా కూడా ఈవీఎంను ఉపయోగించవచ్చు.


ఒక ఈవీఎం మెషిన్‌లో ఎన్ని ఓట్లు వేయొచ్చు..

ఓట్లను నిల్వ చేసే ఈవీఎం సామర్థ్యం దాని మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. పాత వెర్షన్ EVM (2000-05 మోడల్)లో గరిష్టంగా 3840 ఓట్లు నిల్వచేయవచ్చు. అదే సమయంలో కొత్త వెర్షన్ EVM (2006 నుండి వస్తున్న మోడల్) లో గరిష్టంగా 2000 ఓట్లను నిల్వ చేయవచ్చు. ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం, కంట్రోల్ యూనిట్ ఫలితాలను 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దాని మెమరీలో నిల్వ చేయవచ్చు.


PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 09:49 AM