Share News

Delhi: నేడు మూడో దశ

ABN , Publish Date - May 07 , 2024 | 03:19 AM

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

Delhi: నేడు మూడో దశ

  • దేశవ్యాప్తంగా 93 లోక్‌సభ

  • నియోజకవర్గాల్లో ఓటింగ్‌

  • గుజరాత్‌లోని అన్ని సీట్లకూ ఒకేసారి

  • మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10,

  • మధ్యప్రదేశ్‌లో 8, కర్ణాటక 14, అసోంలో 4 స్థానాలకు..

  • నేటితో 283 స్థానాల్లో పోలింగ్‌ పూర్తి

  • అహ్మదాబాద్‌లో ఓటేయనున్న మోదీ

  • బరిలో షా, పలువురు ప్రముఖులు

  • నేడు మూడో దశ పోలింగ్‌

  • దేశవ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో ఓటింగ్‌

న్యూఢిల్లీ, మే 6(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. గుజరాత్‌(25), కర్ణాటక(14), మహారాష్ట్ర(11), ఉత్తరప్రదేశ్‌(10), మధ్యప్రదేశ్‌(8), ఛత్తీ్‌సగఢ్‌(7), బిహార్‌(5), పశ్చిమ బెంగాల్‌(4), అసోం(4),, గోవా(2), దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, జమ్ముకశ్మీర్‌(1)లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దశతో గుజరాత్‌, కర్ణాటక, అసోంలోని అన్ని స్థానాల్లోనూ పోలింగ్‌ పూర్తి కానుంది. దేశంలోని మొత్తం 283 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ ముగియనుంది. కాగా, మూడో దశలో 17.24 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.


మరోవైపు బీఎ్‌సపీ అభ్యర్థి మృతితో వాయిదా పడ్డ మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ స్థానానికి కూడా ఈ దశలో ఓటింగ్‌ జరగనుంది. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌ షా (గాంధీనగర్‌)తో పాటు గుజరాత్‌కు చెందిన కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాలా (రాజ్‌కోట్‌), మన్‌సుఖ్‌ మాండవీయ (పోరుబందర్‌) పోటీ చేస్తున్న నియోజకవర్గాలు మూడో దశలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ (విదిశ), దిగ్విజయ్‌(రాజ్‌గఢ్‌) బరిలో ఉన్నారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి (ధార్వాడ్‌) ఈ దశలోనే పోటీలో ఉన్నారు.


నకిలీ సమాచారాన్ని 3 గంటల్లోగా తొలగించండి

న్యూఢిల్లీ, మే 6: తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాల్లో నకిలీ సమాచారం ఉందన్న విషయం తెలిసిన మూడు గంటల్లోగా దాన్ని తొలగించాలని ఎన్నికల సంఘం సోమవారం అన్ని పార్టీలను ఆదేశించింది. ఒకరి మాటలను మరొకరికి ఆపాదించడం, మహిళలను కించపరచడం వంటి సమాచారం ఉన్న వీడియోలను, డీప్‌ఫేక్‌ వీడియోలను పెట్టకూడదని తెలిపింది.

Updated Date - May 07 , 2024 | 03:20 AM