Share News

Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్‌ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!

ABN , Publish Date - May 04 , 2024 | 12:12 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులు బిజీగా గడుపుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకుడు రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అరారియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆరోగ్యం క్షీణించింది. అకస్మాత్తుగా వెన్నునొప్పి రావడంతో నడవడానికి ఇబ్బంది పడ్డారు.

Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్‌ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!
Tejaswi Yadav

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులు బిజీగా గడుపుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకుడు రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అరారియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆరోగ్యం క్షీణించింది. అకస్మాత్తుగా వెన్నునొప్పి రావడంతో నడవడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది సాయంతో వేదికపై నుంచి కారు వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తేజస్వి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తేజస్వీ యాదవ్‌కు నడుము కండరాలు పట్టేయడం వల్ల తీవ్ర నొప్పి మొదలైంది. అతని ఆరోగ్యం క్షీణించడంతో భద్రతా సిబ్బంది సహాయంతో అతన్ని సభా వేదికమీద నుంచి కిందకి దించారు. తేజస్వి యాదవ్ శుక్రవారం బీహార్‌లోని అరారియాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు, అతనికి అకస్మాత్తుగా వెన్నునొప్పి రావడంతో నడవడానికి ఇబ్బంది పడ్డారు. తేజస్వి యాదవ్ ప్రతిరోజూ ఐదు నుండి ఆరు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. బీహార్‌లో ఇండియా కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్‌గా తేజస్వి యాదవ్ ఉన్నారు. ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున తేజస్వి యాదవ్ ప్రచారం చేస్తున్నారు.

రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌


తీవ్ర నొప్పితో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తేజస్వి యాదవ్ తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. వేదికపై నుంచి కిందకి దిగేందుకు ఇబ్బంది పడుతుండగా.. భద్రతా సిబ్బంది సహాయంగా నిలిచారు. పోలీసుల సహకారంతో వేదికపైనుంచి కిందికి దిగి కారు వద్దకు చేరుకున్నారు. తేజస్వి యాదవ్ వాహనం లోపల కూర్చున్న తర్వాత బాగానే కనిపించినప్పటికీ, తన చుట్టూ గుమిగూడిన మద్దతుదారుల వైపు చూస్తూ.. అభివాదం చేస్తున్నప్పటికీ..విపరీతమైన ఎండల కారణంగా తేజస్వి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.


97 సభల్లో..

తేజస్వి యాదవ్ బీహార్‌లో ఇప్పటిరవు 97 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏడో దశవరకు బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తేజస్వి యాదవ్ మరిన్ని ఎక్కువ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఎన్డీయే కూటమికి ధీటుగా ఇండియా కూటమి తరపున తేజస్వి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తే ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ.. వాయనాడ్ ప్రజల స్పందన ఇదే

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 12:23 PM