Share News

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

ABN , Publish Date - May 06 , 2024 | 05:28 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు.

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

హైదరాబాద్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. టీటీడీపీ నేతలతో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై మాట్లాడారు.


Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీటీడీపీ బీజేపీకి మద్దతిస్తున్నట్లు చింతల రామచంద్ర రెడ్డి తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పనిచేస్తున్నారని అన్నారు. ఎలాంటి భేషజాలు పెట్టుకోకుండా టీడీపీ నేతలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు బీజేపీకి సహకరించాలని కోరారు. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లే విధంగా కృషి చేయాలని అన్నారు. టీడీపీ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్లకుండా చూడాలని అన్నారు. ఈ ఎన్నికల్లో వేరే పార్టీలకు ఓటు వేస్తే తమ రెండు పార్టీలకు కూడా నష్టమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.


Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి కిషన్ రెడ్డికి టీడీపీ నేతలు ఇస్తున్న మద్దతు శుభ పరిణామమని అన్నారు. ఈనెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ కేడర్ కూడా భారీగా పాల్గొనాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సభ తెలంగాణకు దశా, దిశా, దిక్సూచిని సూచిస్తుందని చింతల రామచంద్ర రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 06:44 PM