Share News

Lok Sabha Election 2024: నన్ను గెలిపిస్తే.. ఆ హామీలు నెరవేరుస్తా: కడియం కావ్య

ABN , Publish Date - May 09 , 2024 | 07:14 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: నన్ను గెలిపిస్తే.. ఆ హామీలు నెరవేరుస్తా: కడియం కావ్య
Kadiyam Kavya

హనుమకొండ: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.


Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?

వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి ఇండస్ట్రీయల్ కారిడార్‌గా మార్చడానికి ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. ఐఏఏ వరంగల్‌లో ఏర్పాటుకు కృషి చేస్తానని ఉద్ఘాటించారు. ఐటీ హాబ్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. విభజన హామీల్లో భాగంగా కాజీపేట్ రైల్వే కోచ్ సాధనకు పోరాడతానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని వివరించారు. మహిళా సాధికారతకు నైపుణ్యం శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 35ఏళ్ల తర్వాత మహిళకు అవకాశం వచ్చిందని.. ఈ ఎన్నికల్లో మహిళామణులు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు.


మీ ఆశీస్సులు ఉంటే తాను తప్పకుండా గెలుస్తానని అభ్యర్థించారు. తనకు హిందీ, ఇంగ్లిష్, తెలుగు బాషలపై పట్టు ఉందని.. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో లేవనేత్తి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పాలన నచ్చి పలువురు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని కడియం కావ్య పేర్కొన్నారు.

T.High Court: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 07:14 PM