Share News

AP Elections: మద్యం నిషేధంపై షర్మిల ‘నవ సందేహాలు’ ఇవే.. జగన్‌ సమాధానం ఏంటో?

ABN , Publish Date - May 04 , 2024 | 10:57 AM

Andhrapradesh: మద్యం నిషేధంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై కడప ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవెరుస్తామని.. పూర్తి మద్య నిషేధం తర్వాతే 2024 ఎలక్షన్‌లో ఓట్లు అడుగుతానంటూ 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్‌ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు.

AP Elections: మద్యం నిషేధంపై షర్మిల ‘నవ సందేహాలు’ ఇవే.. జగన్‌ సమాధానం ఏంటో?
APCC Chief YS sharmila Reddy Letter to CM jagan

కడప, మే 4: మద్యం నిషేధంపై ( Madyapana Nishedam) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) ఇచ్చిన హామీపై కడప ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవెరుస్తామని.. పూర్తి మద్య నిషేధం తర్వాతే 2024 ఎలక్షన్‌లో ఓట్లు అడుగుతానంటూ 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్‌ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి "నవ సందేహాలు" పేరుతో మరో లేఖ రాశారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించక పోగా... తిరిగి మద్యం అమ్మకాల్లోనే వేల కోట్లు సంపాదించుకున్నారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా దొరకని బ్రాండ్‌లను ఏపీలో అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

AP Pension: పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధులు


షర్మిల నవ సందేహాలు ఇవే..

1) మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ ? పాక్షికంగా అయినా అమలు అవుతుందా ?

2) మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు... నిషేధం అమలు చేశాకే మళ్ళీ ఓటు అడుగుతా అన్నారు ? ఏమయ్యింది ?

3) మద్యం అమ్మకాల్లో 20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారు..అంటే అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్లు కాదా ?

4) మద్యం ద్వారా ఆదాయం అంటే...ప్రజల రక్తమాంసాలు మీద వ్యాపారం అన్నారు..మీరు చేస్తున్నది ఏంటి?

5) ఎక్కడ దొరకని బ్రాండ్ లు , కనీ వినీ ఎరగని బ్రాండ్ లు ఇక్కడే అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు ?

6) బెవరేజేస్ కార్పొరేషన్ ను చేయూత,ఆసరా, అమ్మఒడి అమలు బాధ్యత అప్పగించడాన్ని ఎలా సమర్ధిస్తారు ?

7) బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11 వేల కోట్లు రుణాలు ఎందుకు సేకరించాలని అనుకున్నారు ?

8) మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపి మొదటి స్థానం ఎందుకు ఉంది ?

9) రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అంటే మీ వైఫల్యం కాదా?


ఇవి కూడా చదవండి...

Anand Mahindra: వామ్మో.. సర్వీస్ అంటే ఇలా ఉంటుందా? షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

Vijayawada: దుర్గగుడిలో ఇంజినీరింగ్ అధికారి రాసలీలలు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2024 | 11:55 AM