Share News

Gold Price: పసిడి మరింత ప్రియం.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

ABN , Publish Date - Mar 08 , 2024 | 07:30 AM

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం ధర పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరింది. అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.60,100కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.65,560కి చేరింది.

Gold Price: పసిడి మరింత ప్రియం.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్: బంగారం (Gold) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా డాలర్ బలహీన పడటంతో బంగారం (Gold) ధర పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరింది. అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం (Gold) ధరలకు రెక్కలొస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.60,100కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.430 పెరిగి రూ.65,560కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.65,710గా ఉంది. వెండి ధర కూడా బంగారం ధర బాటలో పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.500 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,400గా ఉంది. బెంగళూరులో మాత్రం కాస్త తక్కువగా రూ.74,600గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 07:30 AM