Share News

Onion Prices: సామాన్య ప్రజలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ఉల్లి ధరలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:45 PM

దేశంలో గత 14 రోజులుగా ఉల్లి ధరలు(Onion prices) 30 నుంచి 50 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు బక్రీద్ కంటే ముందే ఉల్లికి భారీగా డిమాండ్(demand) ఏర్పడిందన్నారు. అయితే ఉల్లి ధరలు ఎంత పెరిగాయానే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.

Onion Prices: సామాన్య ప్రజలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ఉల్లి ధరలు
Onion prices hike 30 to 50% in 14 days

దేశంలో గత 14 రోజులుగా ఉల్లి ధరలు(Onion prices) 30 నుంచి 50 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు బక్రీద్ కంటే ముందే ఉల్లికి భారీగా డిమాండ్(demand) ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే పలువురు వ్యాపారులు ఉల్లిని నిల్వ ఇంకా నిల్వ చేసి సేల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు వ్యాపారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో గత 10 రోజుల్లో కిలో ఉల్లి ధర రూ.12 పెరిగింది.


ఇక తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్ విధానంలో కిలో ఉల్లి ధర రూ. 32 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ. 40 నుంచి రూ. 50 పలుకుతోంది. మరోవైపు చెన్నైలో కిలో ఉల్లి ధర గరిష్టంగా రూ.50 నుంచి రూ.70గా ఉంది. ఇక మహారాష్ట్ర నాసిక్‌లోన లాసల్‌గావ్ మండిలో సోమవారం సగటు హోల్‌సేల్ ధర కిలో రూ.30 ఉండగా, మే 25న ఇదే ధర కిలో రూ. 17గా ఉండేది. రిటైల్ మార్కెట్లో ఈ ధరలను మరింత పెంచి అమ్ముతున్నారు.


ప్రధానంగా మహారాష్ట్ర(maharashtra) నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఉల్లిపాయలు ఎక్కువగా సరఫరా అవుతాయి. అయితే ఎగుమతి సుంకం రేట్లను పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అజిత్ షా చెబుతున్నారు. జూన్‌ నుంచి మార్కెట్‌కు వస్తున్న ఉల్లి.. వ్యాపారులు నిల్వ ఉంచిన వాటి నుంచి వస్తోందని అంటున్నారు. 2023-24 రబీ పంట తగ్గుదల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిందని, ఈ క్రమంలో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


ఇది కూడా చదవండి:

SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌

iPhones : ఐఫోన్లకూ జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ హంగులు

For Latest News and Business News click here

Updated Date - Jun 11 , 2024 | 12:48 PM