Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

GST: నేడు జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ చీఫ్‌ సదస్సు.. ఏం చర్చిస్తారంటే..?

ABN , Publish Date - Mar 04 , 2024 | 09:47 AM

పన్ను ఎగవేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేత సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది. రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ అధికారుల ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌ సదస్సును సోమవారం (ఈ రోజు) ఢిల్లీలో నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభిస్తారని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

GST: నేడు జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ చీఫ్‌ సదస్సు.. ఏం చర్చిస్తారంటే..?

ఢిల్లీ: పన్ను ఎగవేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేత సమస్య పరిష్కరిస్తామని చెబుతోంది. రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ (GST) అధికారుల ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్‌ సదస్సును సోమవారం (ఈ రోజు) ఢిల్లీలో నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సదస్సును ప్రారంభిస్తారని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వస్తు సేవల పన్ను, జీఎస్టీ (GST) ఎగవేతల గురించి సదస్సులో చర్చకు రానుంది. జీఎస్టీ వసూళ్ల కోసం ఉన్న సవాళ్లు, పన్ను వసూల్ కోసం మరిన్ని విజయవంతమైన పద్ధతులను పరిశీలిస్తారు. జీఎస్టీకి సంబంధించి నకిలీ ఇన్ వాయిస్ సమస్య ఉత్పన్నం వస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించడంపై దృష్టిసారించనుంది. జీఎస్టీ వసూళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా మెరుగుపరచాలనే అంశంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 09:50 AM