Share News

Janasena: తొలి జాబితాతో తాడేపల్లి ప్యాలెస్‌లో భూకంపం: వంశీకృష్ణ శ్రీనివాస్

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:20 AM

Andhrapradesh: టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో భూకంపం వచ్చిందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జనసేన పొత్తుతో భయపడి వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాపులు అమాయకులు అని వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని.. రానున్న ఎన్నికలలో కాపులు తమ సత్తా చూపిస్తారన్నారు.

Janasena: తొలి జాబితాతో తాడేపల్లి ప్యాలెస్‌లో భూకంపం: వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: టీడీపీ జనసేన (TDP-Janasena)తొలి జాబితా ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో భూకంపం వచ్చిందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జనసేన పొత్తుతో భయపడి వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాపులు అమాయకులు అని వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని.. రానున్న ఎన్నికలలో కాపులు తమ సత్తా చూపిస్తారన్నారు. రాష్ట్రంలోని కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని... పవన్‌ను చూసి ఓటు వేస్తామని అంటున్నారని తెలిపారు. సీట్లు, పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్‌కు చాలా క్లారిటీ ఉందన్నారు. ‘‘మాకు మా నాయకుడు మాటే వేదం... పవన్ కళ్యాణ్ వెంటే ఉండతామని జనసేన నాయకులు చెబుతున్నారు’’ అని తెలిపారు. కాపు కార్పోరేషన్‌కు ఎం చేశారో వైసీపీ మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు.

మంత్రి కారుమూరిపై ఫైర్..

బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేశామని వైసీపీ నాయకులు మాయమాటలు చెబుతున్నారన్నారు. విశాఖలో యాదవ కార్పోరేషన్ భవనం శంకుస్థాపనకు యాదవ కార్పోరేషన్ చైర్మన్ రాలేదన్నారు. మంత్రి కారుమురి నాగేశ్వరరావు తనపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని... వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేసిన వ్యక్తి కారుమురి నాగేశ్వరరావు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి కారుమురి నాగేశ్వరరావు తనపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓట్లు కోసమే ఎంపీ ఎంవీవీ విశాఖలో యాదవ భవనానికి విరాళం ఇస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికలలో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని వంశీ కృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 04:53 PM