Share News

AP Election 2024: పేరెంట్స్‌ మీటింగ్ ఎలా పెడతారు.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

ABN , Publish Date - Apr 16 , 2024 | 08:30 PM

ఎన్నికల సంఘం పలుమార్లు చెప్పినా కొంతమంది ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) అన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కలిసి పలు ఫిర్యాదులు అందజేశారు.

 AP Election 2024: పేరెంట్స్‌ మీటింగ్ ఎలా పెడతారు.. సీఎం జగన్‌పై వర్లరామయ్య ఫైర్

అమరావతి: ఎన్నికల సంఘం పలుమార్లు చెప్పినా కొంతమంది ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) అన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు కలిసి పలు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ..సీఈవో మీనాను కలిశామని.. ఎంత చెప్పినా అధికారుల్లో మార్పులు రావడం లేదన్నారు. వారు జగన్ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు.


AP Election 2024: ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి.. నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు

ప్రవీణ్ ప్రకాష్‌ అనే అధికారి జగన్ వద్ద మోకాళ్లపై నిలబడి మాట్లాడుతారని ధ్వజమెత్తారు. గతంలో పేరెంట్స్‌తో మీటింగ్ పెడతామన్నారని.. కానీ ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆపారని చెప్పారు. ఇప్పడు అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ పెడుతామంటున్నారన్నారు. ఇప్పడు ఎందుకు ఈ మీటింగ్... ఈనెల 23వ తేదీన పేరెంట్స్ మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ మీటింగ్‌లో వైసీపీకి ఓటెయ్యాలని చెపుతారా అని ప్రశ్నించారు. మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధి తోట త్రిమూర్తులు వలంటీర్లతో ర్యాలీ తీస్తున్నారని చెప్పారు. వలంటీర్లను రాజీనామా చేయాలని కోరుతున్నారని.. వారు పార్టీకోసం పనిచేయడాకే అన్నట్టు వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.


AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్

కనిగిరిలో కూడా వైసీపీ అభ్యర్ధి వలంటీర్లు రాజీనామా చేయాలని తమపార్టీకి పని చేయాలని చెబుతున్నారని అన్నారు. వలంటీర్ల ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో గులకరాయితో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని చంపాలని చూశారని అంటున్నారని చెప్పారు. ఇలాంటి డ్రామా ఆడడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.

ఇది చాలదన్నట్టు వైసీపీ నేతలు నిన్న రోడ్లపై ధర్నాలు చేస్తారా అని నిలదీశారు. ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఇంత చేస్తుంటే ఏసీపీ, సీఐ ఎందుకు పట్టించుకోట్లేదని ప్రశ్నించారు. ఇలాంటి అధికారులను పెట్టుకుని ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.ఏసీపీని, సీఐని ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలని కోరారు. జగన్ ఆస్కార్ అవార్డు ఇచ్చేంత పెద్ద నటుడని సెటైర్లు గుప్పించారు. గజమాల గీసుకొని దెబ్బ తగిలితే గులకరాయి డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు.


CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు

ఆ అధికారిని బదిలీ చేయాలి: జవహర్

ఎన్నికల అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. విజయవాడ సీపీ చంద్రబాబుకు శిక్షపడింది అనగానే తన ముందే కంగ్రాట్య్ చెబుతారా అని ధ్వజమెత్తారు. వాసుదేవరెడ్డిని బదిలీ చేసినట్టే ఆయన్ను కూడా బదిలీ చేయాలని కోరామని జవహర్ చెప్పారు.


YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 08:30 PM