Share News

TDP: ఆ అధికారి ఆదేశాల మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం.. టీడీపీ నేతల మండిపాటు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:53 PM

Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్‌లో హెరిటెజ్‌కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

TDP: ఆ అధికారి ఆదేశాల మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం.. టీడీపీ నేతల మండిపాటు

అమరావతి, ఏప్రిల్ 8: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్‌లో హెరిటెజ్‌కు (heritage) సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సీఐడీ సిట్ అధికారులు భావించారని.. అందుకే ముందు జాగ్రత్త చర్యగా డాక్యుమెంట్లు తగలబెట్టారని మండిపడ్డారు. ఈ డాక్యూమెంట్లు దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిట్ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి గత అయిదేళ్ల నుంచి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. ఆయన ఆదేశాల ప్రకారమే అధికారులు హెరిటేజ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు దగ్ధం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా శిక్షర్హులు అవుతారన్నారు. ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారు అనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పత్రాల దగ్థంపై డిజి, సిట్ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని అన్నారు.

AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు


తమ చేతులకు మట్టి అంటకుండా ఉండేందుకే...: దేవినేని

హెరిటేజ్‌కు చెందిన ఐటీ రిటర్న్‌లకు సంబంధించిన పత్రాలు దగ్థం చేసినట్టు తెలుస్తోందని.. రఘురామి రెడ్డి ఆదేశాలు మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి అధికారం తథ్యమని తెలడంతో రేపు ఇబ్బంది లేకుండా సాక్ష్యాలు మాయం చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకే ఈ డాక్యుమెంట్లు దగ్ధం చేశారన్నారు. డీజీపీ, రఘురామిరెడ్డి ఈ వ్యవహరంపై తక్షణం స్పందించాలన్నారు.

Solar Eclipse 2024: నేటి సూర్యగ్రహణం ఎందుకంత అరుదైనది?.. దీని వెనుకున్న అసలు కారణాలు ఇవే!


ప్రత్యక్ష సాక్షి బ్రహ్మం చౌదరి కామెంట్స్

‘‘ఒక వ్యక్తి సంచి పట్టుకొని పత్రాలు తీసుకువచ్చారు. అక్కడే ఉన్న నా స్నేహితుడు ఏమిటా పత్రాలు అని ప్రశ్నించారు. ఈ పత్రాలు హెరిటేజ్ సంస్ధకు సంబంధించినవి అని తీసుకువచ్చిన వ్యక్తి తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే తెలుసుకొని పార్టీకి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లా. అధికారంలోకి వస్తే తప్పలు చేసిన అధికారులను వదలం అని చెపుతున్న నేపథ్యంలో పత్రాలు తగలబెట్టారని తెలుస్తోంది. తమ ప్రమేయం పట్ల ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతోనే అధికారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు’’ అని ఆరోపించారు.


మేము చెప్పిందే నిజమని తేలింది: పట్టాభి

తాము మొదటి నుంచి చెపుతూనే ఉన్నామని.. అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారని అప్పుడే చెప్పామన్నారు. ఈ డాక్యుమెంట్ల దగ్ధం ద్వారా తాము చెప్పింది నిజం అని ఇప్పుడు తేలిపోయిందన్నారు. తప్పు లేకపోతే ఎందుకు ఈ డాక్యుమెంట్లు తగలబెడుతున్నారని ప్రశ్నించారు. దొంగచాటుగా డాక్యుమెంట్లు ఎందుకు నాశనం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హెరిటేజ్‌కు సంబంధించి ఐటి రిటర్న్‌లు మీకు ఎలా వచ్చాయి అని గతంలోనే నారా లోకేష్‌ ప్రశ్నించారన్నారు. ఇటువంటి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి చంద్రబాబును అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ప్రభుత్వం మారినా దొరక్కుండా ఉండేదుకే ముందస్తుగా పత్రాలు ధ్వంసం చేశారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ఇటువంటి తప్పుడు అధికారులను చేతిలో పెట్టుకొని తప్పుడు కేసులు నమోదు చేశారని పట్టాభి మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 01:57 PM